నటసింహ నందమూరి బాలకృష్ణ కథా నాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. కరోనా ఉద్ధృతి వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడటం వల్ల మిగిలిన షూట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజా షెడ్యూల్ చారిత్రక ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలోని గండికోట, కడప, చిత్తూరులోని చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందని సమాచారం. బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ‘అఖండ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.