నటసింహ నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’.. బాలయ్య డబుల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. కాగా షూటింగ్ దగ్గర పడుతున్న క్రమములో కరోనా సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. అయితే అతిత్వరలోనే షూటింగ్ పునప్రారంభం కానున్న నేపథ్యంలో మేకర్స్ లొకేషన్స్ వేటలో పడ్డారు. ఏపీలోని చరిత్రాత్మక ప్రాంతాల్లో చిత్రీకరించడానికి దర్శకుడు బోయపాటి రౌండప్ వేస్తున్నారు. కాగా ఈరోజు కడప నుంచి తిరుపతి వైపుగా వెళ్తున్న క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. ‘అఖండ’ సినిమా దాదాపు పూర్తి కావచ్చిందని.. ఫైనల్ షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశంతో పాటు, ఓ పాట మిగిలుందని బోయపాటి తెలిపారు.