Zeeshan Siddique: ఎన్సీపీ గూటికి బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్
- ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్..
- కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అజిత్ పవార్..
- వాండ్రే ఈస్ట్ నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్న జీషన్ సిద్ధిఖీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zeeshan Siddique: మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జిశాన్ సిద్ధిఖీ కూడా ఎన్సీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవడంతో అజిత్ పవార్ వర్గంలో చేరినట్లుగా తెలుస్తుంది. ఎన్సీపీ తరపున బాంద్రా ఈస్ట్ నుంచి జీషన్‌ను బరిలోకి దింపుతున్నట్లుగా ఎన్సీపీ అజిత్ వర్గం వెల్లడించింది.
Read Also: Adilabad: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు.. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర ఎంతంటే..
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
ఇక, గతంలో జీషన్ కాంగ్రెస్ టికెట్‌పై వాండ్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ను పార్టీ బహిష్కరించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అతడికి టికెట్ రాకపోవడంతో.. ఎన్సీపీ పవార్ వర్గంలో చేరాడంతోప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పార్టీలో చేరిన తర్వాత జీషన్ మాట్లాడుతూ.. నాకు, నా ఫ్యామిలికీ ఇది ఎంతో ముఖ్యమైన రోజు.. మేము కష్టంలో ఉన్నప్పుడు మావెంట ఉండి ధైర్యం చెప్పిన అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. ఇక, బాంద్రా నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నా.. ఇక్కడి ప్రజల ప్రేమ, సపోర్టుతో మళ్లీ విజయం సాధిస్తాను అని నమ్ముతున్నాను అన్నారు.
Read Also: KA Trailer: ‘క’ ట్రైలర్ విడుదల.. అంచనాలు పెంచేలా, ఆసక్తిరంగా..!
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్సీపీ పవార్ వర్గం అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులోనూ బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్‌కు బాంద్రా స్థానం నుంచి టికెట్ కేటాయించినట్లుగా పేర్కొనింది. ఎన్సీపీ పార్టీ అధినేత అజిత్ పవార్ అతడి కుటుంబానికి కంచుకోట అయిన బారామతి స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 20న ఒకే దఫాలో పోలింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అయితే, శివసేన, ఎన్సీపీ పార్టీల చీలిక తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!