మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణ వార్తతో తీవ్ర షాక్కు గురైనట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎక్స్లో పేర్కొన్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం యావత్తు భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బారామతి ఎయిర్ పోర్ట్ సమీపంలో ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో అజిత్ పవార్తో సహా ఆరుగురు మరణించినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.