Sunetra Pawar: నేషనలిస్ట్ కాంగ్రెరస్ పార్టీ(ఎన్సీపీ) శాసనసభా పక్ష నేతగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను ఏరకగ్రీంగా ఎన్నుకున్నారు. అజిత్ పవార్ మరణించిన మూడు రోజులకే ఆమెకు ఈ కీలక బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్రా పవార్‌కు, శనివారం జరిగిన కీలక సమావేశంలో ఈ పదవిని కట్టబెట్టారు. ఈ సమావేశం ముంబైలోని విధాన్ భవన్ సముదాయంలోని అజిత్ పవార్ కార్యాలయంలో జరిగింది. ఆమె పేరును ఎన్సీపీ సీనియర్ నేత దిలీప్ వాల్సే పాటిల్ ప్రతిపాదించగా, మంత్రి ఛగన్ బుజ్‌బల్ మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో అజిత్ పవార్ చిత్రపటానికి పూలమాల వేసి సునేత్ర నివాళులర్పించారు. ఈ సమావేశానికి అజిత్ పవార్ చిన్న కుమారుడు జై పవార్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
Read Also: Balochistan: బలూచిస్తాన్‌లో విరుచుకుపడిన BLA.. 10 మంది పాక్ అధికారులు మృతి..
మూడు రోజుల క్రితం బారామతిలో ఒక కార్యక్రమానికి వెళ్తున్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు మొత్తం ఐదుగురు ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఇదిలా ఉంటే, ఈ రోజు సాయంత్రం సునేత్రా పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సునేత్రా పవార్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. బారామతి నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీలో నిలబడ్డారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఎన్సీపీ బాధ్యతలు సునేత్రా తీసుకోవాల్సి వస్తోంది. అజిత్ పవార్ మరణం తర్వాత పార్టీ స్థిరత్వం, నిరంతర నాయకత్వం కల్పించాలనే ఉద్దేశంతో సునేత్రా పవార్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.