Sharad Pawar: అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ కురువృద్ధుడు శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ మరణంలో ఎలాంటి కుట్ర లేదని, ఇది కేవలం ప్రమాదమే అని స్పష్టం చేశారు. ఈ విషాదాన్ని రాజకీయ చేయొద్దని ఇతర పార్టీలు, నేతలను కోరారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వంటి వారు అజిత్ పవార్ మరణంపై అనుమానాలను వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షనలో దర్యాప్తుకు పిలుపునిచ్చారు. అన్న కొడుకైన అజిత్ పవార్ మరణంపై భావోద్వేగానికి గురైన శరత్ పవార్.. కుట్ర సిద్ధాంతాన్ని కొట్టిపారేశారు. దీనిని ప్రమాదంగా మాత్రమే చూడాలని కోరారు.
Read Also: Janatha Bar: హిందీలోకి లక్ష్మీ రాయ్ ‘జనతా బార్’
“ఇది పూర్తిగా ప్రమాదం; ఇందులో రాజకీయం లేదు. రాష్ట్రం అపారమైన నష్టాన్ని చవిచూసింది, ఇది పూడ్చలేనిది” అని ఆయన అన్నారు. ఈ రోజు ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మృతి చెందారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో సహా అందులో ఉన్న మొత్తం ఐదుగురు మరణించారు. మహారాష్ట్రలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.