Ajit Pawar: ‘‘రన్ వే కనిపించడం లేదు’’.. అజిత్ పవార్ చివరి క్షణాల్లో నాటకీయ పరిణామాలు..
- అజిత్ పవార్ విమానం ప్రమాదంలో కీలక విషయాలు..
- ల్యాండింగ్‌కు పలుమార్లు ప్రయత్నం..
- ల్యాండింగ్‌కు ముందు నాటకీయ పరిణామాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా విషాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ రోజు(బుధవారం) ఉదయం విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ముంబై నుంచి బారామతి బయలుదేరిన ఆయన, ఫ్లైట్ మరికొన్ని క్షణాల్లో ల్యాండ్ అవుతుందనే సమయంలో క్రాష్ ల్యాండ్‌కు గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా మొత్తం ఐదుగురు మరణించారు. అయితే, అజిత్ పవార్ చివరి క్షణాల్లో విమానంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి ముందు ఏం జరిగింది.?
Also Read
- Delhi riots UAPA case: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు షాక్.. మధ్యంతర బెయిల్ నిరాకరణ!
- Dalai Lama's Address: దలైలామాకు ఢిల్లీలో కొత్త నివాసం.. లూటియన్స్ ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా కేటాయించిన కేంద్రం!
- Delhi Gang Rape Case: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరెస్టు
- Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ఉదయం 8.10 గంటలకు ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన, VT-SSKగా నమోదైన లియర్‌జెట్ 45 విమానం ముంబై ననుంచి బారామతి బయలుదేరింది. ఉదయం 8.18 గంటలకు బారామతి విమానాశ్రయంతో విమానం కాంటాక్ట్ అయింది. ముంబై నుంచి బారామతికి 256 కి.మీ, సుమారు 45 నిమిషాల ప్రయాణం. విమానం బారామతికి 30 నాటికల్ మైళ్ల దూరం(55.6 కి.మీ) దూరంలో ఉండగా, పూణే ఏటీసీ నుంచి బారామతికి కంట్రోల్ అప్పగించారు. పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్‌కు వాతావరణ పరిస్థితుల్ని తెలియజేశారు. ఆమె ఇష్టానుసారం ల్యాండ్ చేయాలని సూచించారు.
పైలట్ పాఠక్ విమానాశ్రయ సమీపంలో గాలి వేగం, విజిబిలిటీ గురించి అడిగారు. సాధారణంగా పైలట్లు ల్యాండింగ్ సమయంలో గ్రౌండ్ స్టాఫ్/ఏటీసీతో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని ప్రభుత్వ ప్రకటనలో తెలియజేసింది. ఆమెకు దాదాపు 3000 మీటర్లు/3 కి.మీ ఉందని చెప్పారు. ఇది సాధారణంగా ల్యాండింగ్‌కు సరిపోయే పరిమితి.
ల్యాండింగ్ కోసం విఫలయత్నం..
విమానం కూలిపోయిన సమయంలో బారామతి ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు, తక్కువ విజిబిలిటీ ఉన్నాయని ప్రాథమిక సమాచారం. ల్యాండింగ్‌కు అనుమతి వచ్చిన తర్వాత పైటల్ ఆ అనుమతిని తిరిగి నిర్ధారించాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా పైలట్లు పాటించే స్టాండర్డ్ ప్రోటోకాల్. కానీ అజిత్ పవార్ ప్రయాణించే VT-SSK విమాన పైలట్లు అలా చేయలేదు. కొన్ని క్షణాల్లో రన్‌వేకు సమీపంలో పెద్ద శబ్ధంతో కూలిపోయి, మంటలు చెలరేగాయి.
విమానం రన్‌వే11పై దిగేందుకు అనుమతి వచ్చింది. అయితే, ‘‘రన్ వే కనిపించడం లేదు’’ అని పైలట్ల నుంచి సమాచారం వచ్చింది. దీంతో మరోసారి గో -అ రౌండ్( మళ్లీ ఫ్లైట్ లేకాఫ్ చేసి, తిరిగి ల్యాండింగ్‌కు ప్రయత్నించడం) చేయాలని సూచించారు. గో-అరౌండ్ తర్వాత విమానం దాని స్థానాన్ని తెలియజేసింది. రన్‌వే కనిసిస్తుందా అని అడగగా, కనిపిస్తోందని నిర్ధారణ ఇచ్చారు. ఉదయం 8.34కు విమానానికి ల్యాండింగ్ అనుమతి వచ్చింది. అయితే, ఇక్కడే కీలక లోపం జరిగినట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ అనుమతిని పైలట్ తిరిగి చదివి నిర్ధారించలేదు
ఉదయం 8.43 విమానం సిగ్నల్స్ పంపించడం నిలిపేసింది. ADS-B సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఈ వ్యవస్థ విమానం ఎత్తు, వేగం, దాని స్థానం లాంటి వివరాలను పింపిస్తుంది. ఉదయం 8.46 గంటలకు బారామతి విమానాశ్రయ సమీపంలోని హైవేపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో భారీ పేలుడు, అగ్ని ప్రమాదం కనిపించింది. విమాన రన్‌వేకు సుమారు 100 అడుగుల ముందే విమానం కూలిపోయింది.
ప్రభుత్వ ప్రకటన:
బారామతి విమానాశ్రయ ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో సహా ఐదుగురు అంతా మరణించారు. బారామతి విమానాశ్రయం ఒక అన్‌కంట్రోల్డ్ ఎయిర్ ఫీల్డ్ అని ప్రభుత్వం తెలిపింది. అక్కడ పూర్తి స్థాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లేకపోవడం వల్ల, విమాన రాకపోకల్ని స్థానిక ఫ్లయింగ్ స్కూల్‌కు చెందిన పైలట్లు, సిబ్బంది నిర్వహిస్తారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు ప్రారంభించింది.
తాజావార్తలు
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
AP Assembly Winter Session: డిసెంబర్ 5 నుంచి శీతాకాల సమావేశాలు.. పెట్టుబడులు, పరిశ్రమల పురోగతిపై చర్చ!
ట్రెండింగ్
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!