NCP Meet: రేపు NCP శాసనసభా పక్ష సమావేశం.. ఆమెకే బాధ్యతలు అప్పగించే ఛాన్స్!
- రేపు ఎన్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం
- శాసన సభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశం
- అజిత్ పవార్ శాఖలను నిలబెట్టుకోవాలని ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. ఇక ఎన్‌సీపీని ముందుండి నడిపించేది ఎవరు? అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఎన్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. అయితే అజిత్ పవార్ కుమారులు అంత ఆసక్తిగా లేకపోవడంతో ఆయన భార్య సునేత్రా పవార్‌నే నాయకురాలిగా ఎంచుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అజిత్ పవార్ నిర్వహించిన పోస్టులన్నీ ఎన్‌సీపీ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్లు.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో చర్చలు జరిపారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖ, మరిన్ని శాఖలు నిర్వహించారు. ఆ శాఖలన్నీ ఎన్‌సీపీ నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: ‘సర్’పై పోరాటానికి మమత ప్లాన్.. వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా..!
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ఎన్‌సీపీ తిరిగి పున:కలయిక కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎన్‌సీపీ ఒక్కటి చేసేందుకు రెండు వర్గాల నాయకులు వచ్చే వారం సమావేశం కానున్నట్లు వర్గాలు తెలిపాయి. నాయకత్వం వహించేందుకు ముగ్గురు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ భార్య సునేత్ర, సుప్రియ సూలే, ప్రఫుల్ పటేల్‌లో ఎవరొకరు నాయకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: Trump Video: ఆమె అందం చూసే అతడికి పదవి ఇచ్చా.. ట్రంప్ హాట్ కామెంట్స్
1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత శరద్ పవార్ ఎన్‌సీపీని స్థాపించారు. అనంతరం అజిత్ పవార్ జూలై 2023లో పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆయన వర్గం అధికార మహాయుతిలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బాల్, దిలీప్ వాల్సే-పాటిల్ వంటి శరద్ పవార్ సన్నిహితులు కూడా అజిత్ పవార్ శిబిరంలో చేరారు. తాజాగా అజిత్ పవార్ చనిపోవడంతో తిరిగి కలిసి కోవాలని నేతలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?