Ajit Pawar: వెలుగులోకి అజిత్ పవార్ చివరి ఫోన్ కాల్ సంభాషణ.. మరణానికి ముందు ఏం మాట్లాడారంటే..!
- వెలుగులోకి అజిత్ పవార్ చివరి ఫోన్ కాల్ సంభాషణ
- చివరి కాల్ రికార్డింగ్ విడుదల చేసిన ఎన్‌సీపీ
- ప్రజలకు తెలియాలనే విడుదల చేసినట్లుగా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. జనవరిలో ముంబై నుంచి బారామతికి విమానంలో వస్తుండగా ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా అజిత్ పవార్ చివరి సారి మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణను ఎన్‌సీపీ విడుదల చేసింది. అజిత్ పవార్ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలకు తెలియాలనే ఆడియో విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించింది.
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
జనవరి 28న ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. ఆ సమయంలో ఎన్‌సీపీకి చెందిన 66 ఏళ్ల శ్రీజీత్ పవార్.. అజిత్ పవార్‌కు ఒక మెసేజ్ పంపించారు. ఇక విమానం నెట్‌వర్క్ కవరేజ్ ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత అజిత్ పవారే స్వయంగా తిరిగి ఫోన్ చేశారు. ఉదయం 8:37 నిమిషాలకు కరెక్ట్‌గా ఫోన్ మాట్లాడారు. అంటే మరణానికి ముందు కొన్ని నిమిషాల ముందే మాట్లాడారు.
సంభాషణ ఏంటంటే..
అజిత్ పవార్: మేము అన్ని కులాలు, మతాలను కూడా కలుపుకుని పోతాం.
శ్రీజీత్ పవార్: లేదు దాదా.. నేను నాకు అనిపించిందే చెప్పాను.
అజిత్ పవార్: జిల్లా పరిషత్‌లో సూప్ గ్రూప్ నుంచి మాలి కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లభించింది. మేము అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నించాం.
శ్రీజీత్ పవార్: అవును దాదా.. మీరు సరైనదని భావించే ఏ నిర్ణయమైనా తీసుకోండి.
అజిత్ పవార్-కార్యకర్త శ్రీజీత్ పవార్ మధ్య కేవలం ప్రమాదానికి 10 నిమిషాల ముందు ఈ సంభాషణ జరిగింది. అజిత్ పవార్ మనస్తత్వం ఎలాంటిదో ప్రజలకు అర్థం కావాలనే ఈ ఆడియో విడుదల చేస్తున్నామని శ్రీజీత్ పవార్ పేర్కొన్నారు. అన్ని మతాలు.. కులాలు ఒక్కటి కావాలని దాదా కోరుకున్నారని గుర్తుచేశారు.
‘‘అజిత్ దాదా.. నేను ఒకే గ్రామానికి చెందిన వాళ్లం. నేను ఒక నిర్దిష్ట విషయం గురించి సందేశం పంపాను. నెట్‌వర్క్ కవరేజ్ వచ్చిన వెంటనే దాదా నాకు ఫోన్ చేశాడు. మేము అన్ని కులాలు, మతాలను మాతో పాటు తీసుకెళ్తున్నామన్నారు. అజిత్ దాదా చివరి శ్వాస వరకు ఆయన ఆలోచనలు ఏమిటో మహారాష్ట్రకు తెలిసేలా ఈ ఆడియో కాల్ రికార్డింగ్‌ను అందరి దృష్టికి చేరాలని ఇదొక ప్రయత్నం. అందుకే బహిరంగంగా విడుదల చేస్తున్నాం’’ అని శ్రీజీత్ అన్నారు.

అజిత్ పవార్ ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేశారు. పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గాల్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి కోరిక నెరవేరకుండానే వెళ్లిపోయారు. ఇక ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక విమాన సహాయకురాలు, ఇద్దరు కాక్‌పిట్ సిబ్బంది మరణించారు. ఇక అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన భార్య సునేత్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Trump: నువ్వో చెత్త రిపోర్టర్‌వి.. ముఖంలో స్మైలే లేదు.. మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ ఫైర్
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!