ఈరోజు భారత జట్టు న్యూజిలాండ్ తో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య ఆడితే మన జట్టుకు ప్రమాదం అని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే హార్దిక్ పాండ్య తన భారత కెరీర్‌ను కాపాడుకోవడానికి ఇప్పుడు ఆడుతున్నాడు. మేము హార్దిక్‌ను నెట్స్‌లో చూశాము. అయితే అతను దాదాపు రెండు నెలలుగా బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేయలేదు. అలంటి సమయంలో నేరుగా వచ్చి మ్యాచ్ సమయంలో బౌలింగ్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు అన్నాడు. ఇక పాండ్య బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే అది కనిపిస్తోస్తుంది అని కూడా తెలిపాడు. ఇక ఇన్ని రోజులు బౌలింగ్ చేయని పండుగా రెండు రోజుల ప్రాక్టీస్ తర్వాత బౌలింగ్ లో రాణిస్తాడని ఆశించడం ప్రమాదం అని అన్నాడు. కాబట్టి అతను బౌలింగ్ చేయకపోవడం వల్ల ఈ మ్యాచ్ లో కూడా ఇండియా ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతుంది అని తాను భావిస్తున్నట్లు అగార్కర్ పేర్కొన్నాడు.