After Cheteshwar Pujara retirement Who’s Next in Team India: ‘నయా వాల్’ ఛెతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. పదిహేనేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు పుజారా ఆదివారం (అగస్టు 24) స్వస్తి పలికాడు. ఇదే ఏడాదిలో ఆర్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా రిటైర్మెంట్ అయ్యారు. ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల మనస్సుల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. భారత జట్టులో తదుపరి ఎవరు రిటైర్మెంట్ తీసుకుంటారు?.…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటివరకు కోహ్లీ మొత్తం 770 ఫోర్లు బాదాడు. దీంతో అతను ఫోర్ల పరంగా టాప్ స్థానంలోకి ఎగబాకాడు. గత కొన్ని సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న కోహ్లీ, ఈ రికార్డుతో తన క్లాస్‌ను మరోసారి…
Pat Cummins: ఐపీఎల్ 2025 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 110 పరుగుల భారీ విజయం సాధించి సీజన్ ను ఘనంగా ముగించారు. అయితే, ప్లేఆఫ్ బరిలో నిలబడలేకపోవడంపై జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ విచారం వ్యక్తం చేశారు. మా వద్ద ఆడగలిగే సత్తా ఉంది.. కానీ, కొన్ని సందర్భాల్లో ఆడలేకపోయాం. ఇది మా ఏడాది కాదేమో అంటూ మ్యాచ్ అనంతరం కామెంట్ చేశారు. Read Also:…
DC vs KKR: ఐపీఎల్లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు రెండింటికీ కీలకం కానుంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆప్స్ చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా విజయం సాధించి ప్లేఆప్స్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ భారీ…
తమ బౌలింగ్ విభాగం బాగుందని, ఓపెనింగ్ సరిగా లేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. సరైన ఓపెనింగ్ లేక టోర్నమెంటంతా ఇబ్బంది పడుతున్నామన్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదఐ పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ బాగా చేయలేదని, మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా నమోదు చేయలేకపోతున్నామని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. 8…
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లకు 95 పరుగులకే ఆలౌటై దారుణ ఓటమిని ఖాతాలో వేసుకుంది. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. అయితే కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే రివ్యూ తీసుకోకపోవడం కేకేఆర్ విజయావకాశాలపై ప్రభావం…
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దారుణ ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లకు 111 పరుగులకు కుప్పకూలింది. ఛేదనలో కోల్‌కతా 15.1 ఓవర్లకు 95 పరుగులకే ఆలౌటై.. 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన స్పిన్ బౌలింగ్‌లో విజృంభించి.. 28 పరుగులిచ్చి కీలక 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే వికెట్…
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఓటమి బాధ్యతను తానే తీసుకుంటా అని ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఓటమి బాధ్యతంతా బ్యాటర్లదే అని పేర్కొన్నాడు. ఈ ఓటమి పట్ల కొంచెం నిరాశగా ఉందన్నాడు. ఈ ఓటమితో కుంగిపోమని, ఇక ముందు మ్యాచ్‌ల్లో సరైన ప్రణాళికతో బరిలోకి దిగుతాం అని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 16 పరుగుల తేడాతో…
చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన చెన్నై కుప్పకూలింది. 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 104 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది కోల్‌కతా నైట్ రైడర్స్. అజింక్య రహానె (56), సునీల్ నరైన్ (44), రఘువంశీ (30) పరుగులు చేశారు. కాగా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రహానేపైనే అందరి దృష్టి మళ్లింది. అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన రహానే.. అన్ని ఫార్మాట్లలో ఆడాడు. కానీ క్రమంగా టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. టెస్ట్ క్రికెట్లో ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్…