Air India modifies in-flight alcohol service policy: ఇటీవల ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్రవిసర్జన సంఘటన దేశ ఏమియేషన్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం సేవించి ఓ సీనియర్ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఈ ఘటనపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. విమానంలో ప్రయాణికులు వికృత చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన మరో ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు.
Today (23-01-23) Business Headlines: జూన్ కల్లా ‘విశాఖ’ విస్తరణ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. విశాఖపట్నంలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ పనులను జూన్ చివరికి పూర్తిచేయనుంది. ఈ రిఫైనరీ ప్రస్తుత ప్రొడక్షన్ కెపాసిటీ 83 పాయింట్ 3 లక్షల టన్నులు కాగా దాన్ని దాదాపు రెట్టింపునకు.. అంటే.. ఒకటిన్నర కోట్ల టన్నులకు చేర్చుతున్నారు. ఈ విషయాలను HPCL చైర్మన్ పుష్ప్ జోషి వెల్లడించారు.
Air India Fined 30 Lakhs, Pilot's Licence Suspended For 3 Months: గతేడాది నవంబర్ నెలలో న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియాలో ఓ ప్రయాణికులు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన సంఘటన దేశ విమానయాన రంగంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై విమానయాన రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై ఆగ్రహంతో ఉంది. ఈ మేరకు డీజీసీఏ చర్యలు ప్రారంభించింది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు…
విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన ఘటనలతో విమర్శలను ఎదుర్కొంటోన్న ఎయిరిండియా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది.
విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్ మిశ్రా పరారీలో ఉండటం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
DGCA directives to airlines: ఎయిరిండియా ఘటన దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మహిళపై మూత్రవిసర్జన చేశాడు. ఈ ఘటనపై ఇప్పటికే ఎయిర్ లైనర్ రెగ్యులేటర్ అథారిటీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.