Air India: ఎయిర్ ఇండియా ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవల మూత్ర విసర్జన ఘటనలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా విమానంలో అందించే ఫుడ్ విషయమై మరోసారి వివాదాలను మూటగట్టుకుంది.
Thiruvananthapuram: కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని విధించారు అధికారులు. కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని డమ్మామ్ వెళ్లాల్సిన విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విమానాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి డైవర్ట్ చేశారు.
Air India: ఎయిరిండియా అంతర్జాతీయ విమానంలో మరోసారి సాంకేతిక సమస్య ఏర్పడింది. నెవార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాం స్వీడన్ లోని స్టాక్ హోమ్ కి మళ్లించారు. బోయింగ్ 777-300ఈఆర్ విమానంలోని ఒక ఇంజిన్ లో ఆయిల్ లీక్ కావడంతో సాంకేతిక సమస్య తలెత్తిందని డీజీసీఏ వెల్లడించింది.
Air India: ఎయిర్ ఇండియా డీల్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ఏకంగా 470 కొత్త విమానాలకు ఆర్డర్ చేసి ప్రపంచ విమానయాన రంగంలోనే సంచలనం నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి టాటా సంస్థ ఎయిరిండియాను చేజిక్కించుకున్న తర్వాత దాని రూపురేఖలే మారిపోనున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్ ఈ రెండు సంస్థల నుంచి ఏకంగా 80 బిలియన్ డాలర్ల డీల్ తో ఎయిరిండియా 470 విమానాలను కొనుగోలు చేయనుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.6 లక్షల కోట్లకు పైమాటే.…
Air India: వాణిజ్య విమానయాన చరిత్రలో ఎయిరిండియా సరికొత్త అధ్యాయం లిఖిస్తోంది. ఫ్రాన్స్ సంస్థ ఎయిర్‌బస్‌తోపాటు అమెరికా కంపెనీ బోయింగ్‌తో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండింటి నుంచి 500లకు పైగా కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. తద్వారా భారతదేశ విమానయాన రంగంలో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఎయిరిండియా ఆశిస్తోంది. అదే సమయంలో.. లోకల్ లో-కాస్ట్ ప్రత్యర్థి సంస్థలను మరియు ఎమిరేట్స్ వంటి పవర్‌ఫుల్ గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ను ధీటుగా ఢీకొట్టబోతోంది.
Air India Finalises Deal With Airbus: టాటాల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు నివేదిక చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఎయిర్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.. వచ్చే వారం ఈ ఒప్పందంపై కీలక ప్రకటన చేస్తుందని
అబుదాబి నుంచి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Air India modifies in-flight alcohol service policy: ఇటీవల ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్రవిసర్జన సంఘటన దేశ ఏమియేషన్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం సేవించి ఓ సీనియర్ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఈ ఘటనపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. విమానంలో ప్రయాణికులు వికృత చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన మరో ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు.
Today (23-01-23) Business Headlines: జూన్ కల్లా ‘విశాఖ’ విస్తరణ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. విశాఖపట్నంలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ పనులను జూన్ చివరికి పూర్తిచేయనుంది. ఈ రిఫైనరీ ప్రస్తుత ప్రొడక్షన్ కెపాసిటీ 83 పాయింట్ 3 లక్షల టన్నులు కాగా దాన్ని దాదాపు రెట్టింపునకు.. అంటే.. ఒకటిన్నర కోట్ల టన్నులకు చేర్చుతున్నారు. ఈ విషయాలను HPCL చైర్మన్ పుష్ప్ జోషి వెల్లడించారు.