ఎయిర్ ఇండియా ప్లైట్ లో విచిత్ర సంఘటన వెలుగు చూసింది.. ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించడంతో పాటు సిబ్బంది పై దాడి చేశాడు.. గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసింది..గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఏఐ 882 విమానంలో ఓ ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. ఎయిర్ ఇండియా సిబ్బందితో ఆ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు.. మొదట సిబ్బంది తో గొడవకు దిగిన ఆ వ్యక్తి తర్వాత దాడి చేశాడు.. విమానంలో ఉన్న…
స్వచ్చంద దివాళా పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేట్ విమానయాన సంస్థ ‘గో ఎయిర్’ మరిన్ని కష్టాల్లో చిక్కుకుంది. ఈ నెల రెండో తేదీన ఎన్సీఎల్టీ వద్ద గోఫస్ట్ దివాళా పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే విమానాలు నేలకు పరిమితం కావడంతో గోఎయిర్ కెప్టెన్లుగా ఉన్న పైలట్లు, ఇతర సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ చేస్తున్నారు.
Air India: ఎయిర్ ఇండియా విమానంలోకి ఓ పైలెట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్ లోకి తీసుకెళ్లిన ఘటనలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు పైలెట్ పై మూడు నెలల సస్పెన్షన్ విధించింది. దీంతో పాటు ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల ఫైన్ విధించింది.
Air India: వరసగా పలు వార్తల్లో చర్చనీయాంశంగా మారుతోంది ఎయిర్ ఇండియా. ఈ ఏడాది మొదట్లో ఓ ప్రయాణికుడు మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాజాగా మరో ఎయిర్ ఇండియా మరోసారి వార్తల్లో నిలిచింది. విమానంలో ప్రయాణిస్తున్న మహిళను తేలు కుట్టింది.
ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్ ఇక, దాని విస్తరణపై దృష్టి సారించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నందున కెప్టెన్లు, శిక్షకులతో సహా 1,000 మందికి పైగా పైలట్‌లను నియమించుకుంటుంది.
Air India: ఎయిర్ ఇండియా ఇటీవల వరసగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన ఆ సంస్థ పరువు తీసింది. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విమానయాన సంస్థలకు జరిమానా విధించింది. ఇదిలా ఉంటే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఓ పైలెట్ తన మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. దీనిపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది.
లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ప్రయాణీకుడి తీవ్రమైన వికృత ప్రవర్తన కారణంగా సోమవారం ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఢిల్లీ-లండన్-హీత్రూ మార్గంలో పనిచేయాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 111 బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగి వచ్చింది.
Gannavaram Airport: మరోసారి ఎయిరిండియా నిర్వాకం విదేశీ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది.. నేటి నుండి గన్నవరం-కువైట్ విమాన సర్వీసు ప్రారంభం అయిన విషయం విదితమే.. విజయవాడ నుండి నేరుగా కువైట్ కు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చేసింది.. ప్రతి బుధవారం గన్నవరం నుండి కువైట్‌కు విమానం బయల్దేరనుంది ఈ విమానం.. షెడ్యూల్ ప్రకారం ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్ చేరుకుంటుంది.. ఇక, కువైట్‌లో సాయంత్రం 3.40 గంటలకు…
Women Pilots: భారతదేశంలో మొత్తం పైలెట్లలో 15 శాతం మహిళలే ఉన్నారు. ప్రపంచ సగటు కన్నా ఇది ఎక్కువ. ప్రపంచంలో మహిళా పైలెట్ల సగటు 5 శాతం మాత్రమే ఉంది. భారత దేశంలో మహిళా పైలెట్లు దీనికి మూడు రెట్లు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఎయిర్ ఆపరేటర్లలో 67 మంది విదేశీ పైలెట్లు పనిచేస్తున్నారని ఓ నివేదికలో వెల్లడైంది.