Air India Flight: తప్పిన పెనుప్రమాదం.. గాలిలో ఉండగా విమానం ఇంజిన్‌లో మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Flight: అబుదాబి నుంచి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్‌లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. తిరిగి విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
విమానం టేకాఫ్ అయినప్పుడు అందులో 184 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా మంటలు చెలరేగాయని, పైలట్ వెంటనే గుర్తించి అబుదాబీ ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బీ737-800 విమానం మధ్యలో మంటలు చెలరేగడంతో అబుదాబి విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని డీజీసీఏ తెలిపింది.
Also Read
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
Free Flight Tickets: విమాన టిక్కెట్లు ఫ్రీగా ఇస్తాం.. మా దేశం వచ్చిపోండి
జనవరి 23న త్రివేండ్రం నుంచి మస్కట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత తిరిగి ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 2022లో దుబాయ్‌కి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కనిపించింది.కాలికట్ నుండి దుబాయ్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ B-737 విమానం షెడ్యూల్ ప్రకారం బయలుదేరింది. దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది విమానంలో పాము ఉన్నట్లు నివేదించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశించింది.
తాజావార్తలు
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?