Air India: ఎయిర్‌బస్‌తో ఎయిరిండియా భారీ డీల్.. 250 కొత్త విమానాల కోసం ఒప్పందం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Finalises Deal With Airbus: టాటాల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు నివేదిక చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఎయిర్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.. వచ్చే వారం ఈ ఒప్పందంపై కీలక ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. ఎయిర్‌బస్ తో 250 విమానాల కోసం ఆర్డర్ ఖరారు చేసిందని సమాచారం. దీంతో పాటు సుమారు 200 విమానాల కోసం బోయింగ్ తో ఎయిర్ లైన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
Read Also: Vitamin D: విటమిన్-డితో తగ్గనున్న టైప్-2 డయాబెటిస్ ముప్పు..
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- UPI Charges: రూ.2,000 వరకు UPI పేమెంట్స్ ఫ్రీ.. RuPay డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లకూ ఛార్జీలు లేవు
ఎయిరిండియాను టాటా గ్రూపు యాజమాన్యం దక్కించుకున్న తర్వాత కార్యకలాపాలతో పాటు విమానాలను కూడా విస్తరించాలని చూస్తోంది. ఇటీవల ఎయిరిండియా చీఫ్ క్యాంప్ బెల్ విల్సన్ మాట్లాడుతూ.. కొత్త విమానాల కోసం తమ సంస్థ ఆర్డర్లను ఖారారు చేస్తున్నట్లు తెలిపారు. చివరిసారిగా ఎయిరిండియా 16 ఏళ్ల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. 2005 నుంచి ఒక్క విమానాన్ని కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకుంది.
తాజాగా ఎయిర్ బస్ 250 విమానాల ఒప్పందంలో ఏ350 విమానాలు 40 ఉండే అవకాశం ఉంది. ఈ విమానాలను నిర్వహించే మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా నిలిచిపోనుంది. గతంలో ఎయిరిండియా ఏ330 విమానాలను నడిపింది. ఏవియేషన్ కన్సల్టెన్సీ పీఏపీఏ ప్రకారం 2024 నాటికి భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు 1700 విమానాల కోసం ఆర్డర్లు చేసే అవకాశం ఉంది. దీంట్లో 500 విమానాలను ఎయిర్ ఇండియానే కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?