కొన్ని సంవత్సారాల కిందట 12 వేల ఆఫ్ఘన్ ముష్కర ముఠాను ఓడించారు 21 మంది సిక్కు యోధులు. ఈ పోరాటం యూరోప్‌లోని అన్ని పాఠశాలల్లో బోధించబడుతుంది కానీ మన దేశ పాఠ్యపుస్తకాల్లో ఈ మహాద్భుత ఘట్టానికి చోటుండదు. ఒక వైపు 12 వేల మంది ఆఫ్ఘని దొంగలు … మరో వైపు 21 మంది సిక్కుల మధ్య ఒళ్ళు గగ్గురు పొడిచే పోరాటం జరిగింది.. “గ్రీక్ సపర్త” మరియు “పర్షియన్” యుద్ధం గురించి మీరు వినే ఉంటారు.…
తాలిబన్ల ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో కొలువుదీరింది. సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందరిని సమానంగా గౌరవిస్తామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తాలిబన్లు చెప్పింది ఒకటి చేసింది ఒకటిగా మారింది. తాలిబన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చోటు కల్పిస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు అంటే ఉగ్రవాదులు, కిడ్నాపులు చేసిన వారు, హత్యలు చేసినవారు అని అర్ధం కాబోలు. అందుకే ఆ ప్రభుత్వంలో తాలిబన్ ఫైవ్‌కు చోటు కల్పించింది. ఉగ్రవాద నేర చరిత కలిగిన అబ్దుల్ హక్…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కొలువుదీరింది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చైనా తామున్నామని హామీ ఇచ్చింది. హామీతో పాటుగా ఆ ప్రభుత్వానికి రూ.229 కోట్ల రూపాయలను తక్షణ సాయంగా అందించింది. ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి చైనా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. పాక్ అనుకూల వర్గం చేత ఈ పని చేయిస్తున్నది చైనా. అటు రష్యాకూడా ఆఫ్ఘన్ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నది. రష్యాకు ఆక్రమణలకు వ్యతిరేకంగా ఏర్పటిన సంస్థే తాలిబన్. రష్యా సేనలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైంది. అరాచకాలు సృష్టించిన తాలిబన్లు మరోసారి అధికారంలోకి రావడంతో లక్షలాది మంది ప్రజలు ఆఫ్ఘనిస్తాన్‌ను వదిలి వెళ్లిపోయారు. 1996 నుంచి 2001 వరకు ఆ దేశంలో తాలిబన్ల పాలన సాగింది. ఆ సమయంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల హక్కులను కాలరాశారు. షరియా చట్టాల పేరుతో మహిళలను హింసించారు. ఐదేళ్లపాటు హత్యాకాండ సాగింది. అయితే, 20 ఏళ్ల తరువాత మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకోవడంతో మరోసారి ప్రతి…
పిల్లికి చెలగాటం ..ఎలుకకు ప్రాణ సంకటం. ఆఫ్గన్ మహిళల పరిస్థితి అలాగే ఉంది. ముఖ్యంగా మహిళా క్రికెటర్లు. తాలిబాన్లు చంపుతారన్న భయంతో టీమ్ టీమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కాబుల్‌లో తాలిబాన్లు ఇప్పటికే మహిళా క్రికెటర్ల కోసం వేట మొదలుపెట్టారు. క్రికిటర్లే కాదు ఇప్పుడు దేశంలో ఏ క్రీడాకారిణికి రక్షణ లేదు. కాబూల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. క్రికెట్ జట్టు సభ్యులంతా నిస్సహాయస్థితిలో ఉన్నారు. గత నెల మధ్యలో తాలిబాన్లు కాబూల్‌ని అక్రమించుకున్నప్పటి నుంచి వారికి క్రీడాకారిణిలు టార్గెట్…
మేమింతే.. మారేదే లేదు.. తాలిబాన్లు కుండ బద్దలు కొట్టారు . ఆఫ్గనిస్తాన్‌లో షరియా పాలనే సాగుతుందని తేల్చేశారు. అఫ్గానిస్తాన్ ఇకపై అధికారికంగా ‘‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్’’అవుతుంది. తాలిబాన్ల విధానాలు ఎలా వుండబోతున్నాయని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజా ప్రకటనతో దానికి తెరపడింది. ఇక, ముందు ముందు వాళ్లు ఏం చేస్తారో చూడాల్సివుంది. ఆఫ్గనిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో మళ్లీ ఆక్కడ తాలిబాన్ శకం మొదలైనట్టయింది. ఇకపై తాలిబన్ సుప్రీం లీడర్ మౌల్వీ హిబైతుల్లా…
ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.. ఇక, మహిళలపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు తాలిబన్లు.. తాజాగా అమ్మాయిలు, మహిళలు ఎలాంటి క్రీడలు ఆడకూదంటూ ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్.. ఆఫ్ఘన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.. వారు ఎలాంటి ఆటలు ఆడేందుకు అనుమతి లేదని పేర్కొంది. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదు.. క్రీడలతో బాడీ ఎక్స్పోజింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్…
ప్రపంచానికి హానికరంగా మారిన ఉగ్రవాదులను ఎదురించే దమ్ము అగ్రరాజ్యాలకు సైతం లేదని అప్ఘన్ సంఘటన నిరూపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రసంగాలతో దంచికొట్టే దేశాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయుధ సంపత్తిలో మేటిగా ఉన్న చైనా, అమెరికా లాంటి దేశాలు తాలిబన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కొమ్ము కాస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికీ వారు సొంత ప్రయోజనాలతో తాలిబన్లకు పరోక్షంగా మద్దతు ఇస్తుండటం ప్రస్తుత అప్ఘన్ దుస్థితికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ పరిణామాలన్నీ…
దొంగదెబ్బ.. వెన్నుపోటు. పాకిస్థాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాలిబన్లతో ఎలాంటి సంబంధం లేదని పైకి చెబుతూనే వాళ్ల తరఫున యుద్ధం చేసేందుకు ఉగ్రవాదులను పంపింది పాక్. పంజ్ షీర్ సింహాలను నేరుగా ఢీకొట్టలేని తాలిబన్లు.. కుట్రలమారి పాకిస్థాన్ అండ తీసుకున్నారు. యుద్ధంలో తామే గెలిచా మని పంజ్ షీర్‌లో జెండా ఎగరేశారు. పంజ్ షీర్ గవర్నర్ బంగ్లా దగ్గర తాలిబన్ నేతలు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. దాని కొండ ప్రాంతంలోని లోయల్లో మాత్రం భీకర యుద్ధం నడుస్తోది. పచ్చటి…