ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 వ తేదీనుంచి ఆగస్టు 30 వ తేదీ వరకు అమెరికన్ ఆర్మీ కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నది. ఆగస్టు 31 నుంచి తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి కమర్షియల్ విమానాలు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాలేదు. కాగా, ఈరోజు ఉదయం పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన తొలి విమానం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఇందులో 10 మంది వరకు ప్రయాణికులు…
తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నాక కాబూల్‌లోని ప్రెసిడెంట్ భవనంలో తిష్ట వేసిన సంగతి తెలిసిందే. ప్రెసిడెండ్ భవనంలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఖరీదైన తివాచీలపై కూర్చోని ఇష్టం వచ్చినవి వండించుకొని తింటున్నారు. దీనికి సంబందించిన దృశ్యాలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇదిలా ఉంటే, ప్రెసిడెంట్ భవనంతో పాటుగా ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తోమ్ ఇంటిని కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దోస్తోమ్ తాలిబన్లకు బద్ధశతృవు. పారాట్రాపర్‌గా, కమాండర్‌గా, దేశానికి ఉపాధ్యక్షుడిగా…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైంది. మహిళల విషయంలో తాలిబన్లు కాస్త మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారు. చదువుకునేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఇక, ఉద్యోగాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, కొంత మంది మహిళలు ధైర్యంతో ఉద్యోగాల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్ తిరిగి తెరుచుకోవడంతో అక్కడ 12 మంది మహిళలు తిరిగి ఉద్యోగాల్లో చేరారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోని చెకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఈ మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబం పోషణ జరగాలంటే ఉద్యోగం చేయాలని, ఉద్యోగానికి…
అగ్రరాజ్యం అమెరికా ‘సెప్టెంబర్ 11’ రోజును కలలో కూడా మర్చిపోలేదు. ఈరోజునే అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై విమానాలతో దాడి చేశారు. ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించి అమెరికాకు సానుభూతి తెలిపాయి. ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా మాత్రం అల్ ఖైదా ఉగ్రవాదులకు అఫ్ఘనిస్తాన్ కేంద్రంగా మారిదంటూ ఆ దేశంపై దాడి చేసి వారితో ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఈక్రమంలోనే నాటి తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా నామరూపల్లేకుండా…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రెండోసారి అధికారంలోకి వచ్చారు. 1996 నుంచి 2001 వరకు తాలిబన్లు ఆఫ్ఘన్‌లో అరాచక పాలన సృష్టించారు. ఈ పాలన తరువాత, అమెరికా దళాలు ఆఫ్ఘన్‌లోని ముష్కరులపై దాడులు చేసి తాలిబన్లను తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. 20 ఏళ్లపాటు అమెరికా, నాటో దళాలు అక్కడే ఉన్నాయి. 2021 ఆగస్టు 31 వరకు పూర్తిగా అమెరికన్ దళాలు ఆఫ్ఘన్‌ను వదలి వెళ్లిపోయాయి. దీంతో మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు…
తాలిబన్లు ఎలాంటి వారో అందరికీ తెలుసు. తాలిబన్లు చెప్పేది ఒకటి చేసేది మరోకటి అనే విషయం అందరికీ తెలుసు. ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకున్నాక అందరిని సమానంగా చూస్తామని, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టబోమని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పటికీ దానిని నిలబెట్టుకుంటారు అని ఎవరికీ నమ్మకం లేదు. అందుకే తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. అందరికీ కేబినెట్లో సమానంగా అవకాశాలు ఇస్తామని చెప్పిన తాలిబన్లు ఒక్క మహిళకు కుడా అవకాశం కల్పించలేదు. పైగా…
తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో లేదో… తమ రాక్షసత్వం ఎలా ఉంటుందో ఆఫ్ఘన్ ప్రజలకు చూపుతున్నారు… తాలిబాన్లు. ముఖ్యంగా పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత… రక్తం ఏరులై పారుతోందా? అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. పంజ్‌షీర్‌లో ఇంటింటి తనిఖీలు చేపట్టి… తమ వ్యతిరేకం అనిపించిన వారిని, మైనార్టీలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్ను కూడా తాలిబన్లు హతమార్చారు. ఇక, ఇప్పటికే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అయితే, ఇవాళ జరగాల్సిన…
అఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ నిజస్వరూపాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేస్తున్నారు. తాము చెప్పిందే వేదం.. తాము చేసిందే శాసనం అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంది. దేశంలోని అమాయక ప్రజలపై మానవమృగాల్లా కంటే దారుణంగా రెచ్చిపోతూ తాలిబన్లు రక్తపుటేరులను పారిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు తమకు సాయం చేయండి మహాప్రభో అంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న అప్ఘన్ల అర్తనాదాలు మాత్రం ఎవరికీ విన్పించకపోవడం శోచనీయంగా మారింది. అప్ఘనిస్తాన్‌లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్ నేతలు…
తాలిబన్లకు ఆడవాళ్లు అంటే చిన్నచూపు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే రాదు.. పలు సందర్భాల్లో ఆడవాళ్లపై వాళ్ల వైఖరిని బయటపెట్టేస్తూనే ఉంటారు.. అయితే, తాలిబన్ల ప్రభుత్వంలోనూ తమకు ప్రాతినిథ్యం కల్పించాలంటూ మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. కానీ, మహిళలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు. కేవలం పిల్లలను కనడానికి మాత్రమే కావాలన్నారు. మహిళలు ఎప్పటికీ మంత్రులు కాలేరని… తమ ప్రభుత్వంలో చోటు కల్పించమనన్నారు తాలిబన్లు. ఆయుధాలతో ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. ఆది నుంచి మహిళలనే టార్గెట్…