కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం కుదురుకోవటం పక్కా. అమెరికా , నాటో దళాలకు చెందిన ఆఖరు సైనికుడూ ఆఫ్గన్‌ని వీడాడు. ఇక వారికి ఎదురు లేదు. అయితే ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే తెలియదు. కానీ మన విషయం చూసుకుంటే కాశ్మీర్లో తాలిబాన్ల ప్రభావం ఉంటుందా అన్నది ప్రశ్న. కశ్మీర్ లోయకు తాలిబాన్లను మళ్లిస్తారా…లేదా అన్నది మరో పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక వేళ అదే జరిగితే ఇప్పటికే…
తాలిబన్లు అంటేనే చేతిలో గన్‌తో దర్శనమిస్తారు.. ఇక, వాళ్లకు కోపం వచ్చినా.. ఆనందం వచ్చినా.. గన్నులనే వాడేస్తారు.. ఆప్ఘన్‌ను రాజధాని కాబూల్ సహా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు పంజ్‌షేర్ మాత్రం కొరకరాని కొయ్యగా మారింది.. అక్కడ యుద్ధం ఓవైపు.. చర్చలు మరోవైపు సాగుతున్నాయి.. అయితే, త్వరలోనే ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోన్న తాలిబన్లు.. పంజ్‌షేర్ కూడా తమ వశమైందని శుక్రవారం రోజు ఓ ప్రకటన చేశారు.. దీంతో.. తాలిబన్లు అంతా ఆనందోత్సాహాలతో…
తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో కొలువుదీరినట్టు వార్తలు వస్తున్నాయి. మహిళలను గౌరవిస్తామని ఇప్పటికే తాలిబన్లు అనేకమార్లు ప్రకటించారు. వాళ్లు చెబుతున్న మాటలకు, చేతలకు ఏ మాత్రం పొందికలేదని మరోమారు స్పష్టం అయింది. ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్‌లో నిన్నటి రోజున 50 మంది మహిళలు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రభుత్వంలో అవకాశం కల్పించాలని, మహిళలు లేకుండా ప్రభుత్వం ముందుకు సాగలేదని పేర్కొన్నారు. అలా మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసలు చేస్తుండగా తాలిబన్లు వచ్చి మహిళల…
ఏరుదాటేదాక ‘ఓడ మల్లన్న’.. ఏరు దాటాక ‘బోడ మల్లన్న’ అన్నట్టుగా ఉంది తాలిబన్ల వ్యవహారశైలి. అప్ఘనిస్తాన్ దేశాన్ని వశపరుచుకోవడానికి ముందు అమెరికాకు, ప్రపంచానికి కల్లబొల్లి మాటలు చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశం ఆక్రమణలోకి వచ్చాక తమ అసలు రంగును బయటపెడుతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాలకు ఎసరు పెడుతున్నారు. మొన్నటివరకు ‘కశ్మీర్’పై సంబంధం లేదన్న తాలిబన్లు ఇప్పుడు తగ్గేదేలే అంటూ భారత్ వ్యతిరేక ప్రకటన చేయడం సంచలనమైంది. అఫ్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరోసారి తమ…
ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని ప్రాంతాలను తాలిబన్లు వశం చేసుకున్నా, పంజ్‌షీర్ మాత్రం తాలిబన్లకు దక్కకుండా ఉండిపోయింది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని తాలిబన్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తాలిబన్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు పంజ్‌షీర్ దళాలు. తాలిబన్లు దాడులు చేసిన ప్రతిసారి పంజ్‌షీర్ సైన్యం ఎదురుదాడి చేసి తాలిబన్లను మట్టుబెడుతున్నది. పెద్దసంఖ్యలో తాలిబన్లు పంజ్‌షీర్ చేతిలో హతం అయ్యారు. ఇక ఇదిలా ఉంటే, పంజ్‌షీర్ దళాలపై పోరాటం చేసుందుకు అల్‌ఖైదా సాయం తీసుకున్నారు తాలిబన్లు.…
తాలిబన్లు అంతే.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి.. తాజాగా, జమ్మూ కశ్మీర్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు తాలిబన్లు.. మొదట్లో కశ్మీర్.. భారత్-పాకిస్థాన్ అంతర్గత విషయమని.. అది ఆ రెండు దేశాల ద్వైపాక్షిక అంశమని చెప్పుకొచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు మాట మార్చారు.. ముస్లింలుగా కశ్మీర్, భారత్ సహా ఏ దేశంలోని ముస్లింల కోసమైనా గళమెత్తే హక్కు మాకు ఉంది అంటూ ప్రకటించారు.. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్..…
ఆఫ్ఘనిస్థాన్‌లో పాలనా వ్యవహారాలను చేపట్టేందుకు… ప్రయత్నాలను ముమ్మరం చేశారు తాలిబన్లు. దీనిపై కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు తాలిబన్ వర్గాలు తెలిపాయి.. ఈ రోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత.. ఆఫ్ఘన్లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష భవనంలో కార్యక్రమం ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధులు తెలిపారు. గత సర్కారులోని కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది.…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తప్పుకున్నాక తాలిబన్లు ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. రేపటి రోజున ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నది. ఇప్పటికే కొన్ని తాత్కాలిక శాఖలు ఏర్పాటు చేసినా, రేపటి రోజున ప్రభుత్వం కొలువుదీరాక పూర్తిస్థాయి శాఖలు ఏర్పాటు చేయవచ్చు. అయితే, తాలిబన్ల పరిపాలనలో మహిళలకు రక్షణ ఉండదు. వారంతా ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. అంతేకాదు, మహిళలకు హక్కులు ఏ మాత్రం ఉండవు. ఎవరైనా ఎదిరించి బయటకు వస్తే వారికి ఎలాంటి…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజలు బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు 30 వరకు కాబూల్ ఎయిర్పోర్ట్ వైపు పరుగులు తీసిన ప్రజలు ఇప్పుడు అక్కడ ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. అమెరికా దళాలు లేకపోవడంతో ప్రజలంతా ఏమయ్యారు… ఎటువెళ్లారు. తిరిగి ఇళ్లకు వెళ్లారా అనే డౌట్ రావొచ్చు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత ప్రజలు రూటు మార్చి ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దుల వైపు పరుగులు తీశారు. వేల సంఖ్యలో ఇరాన్ సరిహద్దులకు ప్రజలు చేరుకోవడంతో అక్కడ భద్రతను…
రెండు దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్తాన్‌లో రక్షణ బాధ్యతలు నిర్వహించిన అమెరికా, ఇటీవలే ఆ దేశం నుంచి పూర్తిగా తప్పుకున్నది. అమెరికా దళాలు పూర్తిగా వైదొలిగాయి. పూర్తిగా వైదొలిగిన తరువాత, తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. అమెరికా వదలి వెళ్లిన ఆయుధ సామాగ్రిని తాలిబన్ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన ఆయుధాలను, ప్రజలను, సైనికులను తరలించిన అమెరికా, ఎన్నో ఏళ్లపాటు వారితో కలిసి పనిచేసిన జాగిలాలను కాబూల్ ఎయిర్‌పోర్టులోనే వదలి వెళ్లారు. దీంతో ఆ జాగిలాలు ఆకలితో అలమటిస్తున్నాయి. జాగిలాలలను అలా…