Multiple blasts in Pakistan's Balochistan kill five:పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం బలూచిస్థాన్ ప్రావిన్సులో పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. 12 మంది పౌరులు గాయపడ్డారు. డిసెంబర్ 24 నుంచి పాక్ ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు బలూచిస్తాన్ వ్యాప్తంగా ఇంటలిజెన్స్ సమాచారంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Taliban Bans Women From Working In NGOs: మహిళల స్వేచ్ఛపై మరోసారి తాలిబాన్ పాలకులు ఉక్కుపాదం మోపారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టినప్పటి నుంచి తాలిబాన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూనే వస్తున్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేశారు. బయటకు వెళ్లాలన్నా పూర్తిగా హిజాబ్ ధరించి, కుటుంబంలోని మగవారిని తోడు తీసుకెళ్లాలనే నియమాలను విధించారు. ఇదిలా ఉంటే మరోసారి మహిళలపై ఆంక్షలు విధించింది అక్కడి తాలిబాన్ గవర్నమెంట్.
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న సొరంగమార్గంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో దాదాపు 19 మంది మరణించగా.. 32 మంది గాయపడినట్లు స్థానిక అధికారి ఆదివారం తెలిపారు. కాబూల్‌కు ఉత్తరాన 129 కిలోమీటర్లు (80 మైళ్లు) దూరంలో ఉన్న సలాంగ్ టన్నెల్లో ఈ ప్రమాదం జరిగింది.
Taliban Publicly Execute Murder Accused, First After Afghanistan Takeover: ఆఫ్ఘానిస్తాన్ దేశంలో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా బహిరంగ మరణశిక్షను విధించింది. హత్య నిందితులను బహిరంగంగా శిక్షించింది. పశ్చిమ ఫరా ప్రావిన్స్ లో 2017లో ఓ వ్యక్తిని పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని బహిరంగంగా మరణశిక్ష విధించినట్లు తెలిపింది తాలిబాన్ ప్రభుత్వం. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చారు.
6 Killed, 24 Injured After Blast In Afghanistan:ఆఫ్ఘానిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పిల్లలు, సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ సమంగాన్ ప్రావిన్షియల్ ప్రావిన్స్ లోని అయ్‌బాక్ నగరంలోని మదర్సాలో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది మరణించినట్లుగా సమాచారం. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని నగరంలోని ఓ ఆస్పత్రిలో…
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. చేసేందుకు పనిలేక, వేరే దేశాలకు వలస వెళ్లలేక పశ్చిమ ఆఫ్ఘాన్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. అధికారాన్ని దక్కించుకున్న తర్వాత మహిళలపై ఎన్నోఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బాలికలు, మహిళలపై ఆంక్షలు విధిస్తోన్న తాలిబన్లు.. షరియానూ అమలు చేస్తున్నారు.
Taliban ban Afghan women from gyms, public baths: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నిషేధం ఎక్కువైంది. మహిళలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లాలన్నా మగతోడు కావాల్సిందే. ఇక మహిళ హక్కులనే మాటకు అక్కడ స్థానమే లేదు. ప్రజా ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలు ప్రస్తుతం ఉద్యోగాలను కోల్పోయారు. గతేడాది ఆగస్టులో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు అక్కడ మహిళపై తీవ్రమైన…
Afghanistan: టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్-12 దశలో ఆప్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే చివరి మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియాపై గెలిచినంత పనిచేసింది. చివరకు 4 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. మెగా టోర్నీలో ఒక్క విజయం కూడా లేకుండా తమ జట్టు నిష్క్రమించడంతో ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. జట్టు ఎంపికలో…