జగిత్యాల జిల్లాలో వీర హనుమాన్ శోభయాత్రలో పరిపూర్ణనంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రెండు రకాల ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని హిందువులకు.. హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి కొద్ది దూరంలో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు పౌరులు మరణించగా.. అనేక మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి చేసిన వ్యక్తిని ఆఫ్ఘన్ దళాలు గుర్తించాయి.
పాకిస్తాన్ పై ఆఫ్ఘానిస్తాన్ ఘన విజయం సాధించింది. ఆదివారం రాత్రి షార్జాలో తమ ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల విజయంతో పాటు సిరీస్‌ను కూడా ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది.
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ దిహాండ్రెడ్ లీగ్ లో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరగా తాజాగా పనికూన ఆప్ఘానిస్తాన్ చేతుల్లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఓడడం అంటే అలా ఇలా కాదు.. కనీసం పోరాటం కూడా లేకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండ్ విభాగాల్లో అట్టర్ ప్లాప్ అయింది.
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో మంగళవారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ తోపాటు పాకిస్తాన్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరభారతదేశంలో కూడా రెండు నిమిషాల పాటు ప్రకంపలు వచ్చాయి. ఆఫ్ఘన్, పాక్ లలో భూకంపం వల్ల 11 మంది చనిపోయారు. పాకిస్తాన్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ స్వాత్ లోయలో గాయాల వల్ల ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. పాకిస్తాన్ లో 9 మంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది.…
Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాదాపుగా రెండు నిమిషాల పాటు బలమైన ప్రకంపలను వచ్చాయి.
ఇరాన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 11 మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఇరాన్ సరిహద్దు దళాల చేతిలో చంపబడ్డారని ఖామా ప్రెస్ నివేదించింది. ఇరాన్ సరిహద్దు దళాలు శుక్రవారం పదకొండు మంది ఆఫ్ఘన్ పౌరుల మృతదేహాలను నిమ్రోజ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద తాలిబాన్ అధికారులకు అప్పగించారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అఫ్ఘాన్‌లోని తఖర్ ప్రావిన్స్‌లో బస్సు బోల్తా పడిన ఘటనలో కనీసం 17 మంది బంగారు గని కార్మికులు మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్లు నివేదికలు తెలిపాయి.
India wheat To Afghanista: ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సాయాన్ని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్పై భారత్-మధ్య ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదలైంది.