Earthquake: ఆఫ్ఘానిస్తాన్ లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 1.40 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమి నుంచి 136 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయింది. అంతకుముందు మార్చి 2న ఆఫ్ఘనిస్తాన్ ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 245 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయింది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడ మహిళా విద్యకు ఆస్కారమే లేకుండా పోయింది. తాజాగా పీజీ విద్యార్థినులు విద్యపై కూడా నిషేధం తెలిపింది తాలిబాన్ సర్కార్. మహిళలు ఎంతగా తమ నిరసన తెలిపినా కూడా తాలిబాన్లు వాటన్నింటిని అణిచివేశారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇస్మాయిల్ మషాల్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ తన సర్టిఫికేట్లను ఓ ఛానెల్ లైవ్ ప్రోగ్రాంలోనే చించేశారు.
తీవ్రమైన శీతల వాతావరణం, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా గత రెండు వారాల్లో ఆఫ్ఘనిస్తాన్లో 100 మందికి పైగా మరణించారని ఆదివారం తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్లు మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. పురుషులు లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు రాకూడదని, బురఖా ధరించాలని, బాలికల సెకండరీ స్కూళ్లను మూసివేయాలని, మహిళలు ఉద్యోగం చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన తాలిబాన్ నేతలు దేశంలోని మహిళలకు యూనివర్సిటీ విద్యను కూడా నిషేధించారు.
కాబూల్లోని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 20 మందికి పైగా మరణించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు దాడిని ధృవీకరించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
Earthquake: జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్వార్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
Earthquake: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూప్రకంపనలతో వణికింది. వరసగా వారం వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లోని ఫైజాబాద్ లో 5.9 తీవ్రతలో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్తాన్, ఇండియాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీతో పాటు హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. గురువారం రాత్రి 7.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వచ్చాయి.
Afghan professor tears diploma certificates in protest against women university ban: తాలిబాన్ ఏలుబడిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో మహిళ హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి. తాలిబాన్ పాలకులు మహిళ విద్యపై ఉక్కుపాదం మోపారు. యూనివర్సిటీల్లోకి మహిళను నిషేధించారు. విద్యార్థినులు ఎంతగా ఆందోళన నిర్వహించినా.. తాలిబాన్లు పట్టించుకోవడం లేదు. చదువుకోకపోవడం కంటే తమ తలలు నరికేయడమే బెటర్ అని అక్కడి యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కులకు కూడా వీధుల్లో తిరిగే స్వేచ్ఛ ఉందని కానీ…
Male Afghan Students Boycott Classes, Protest Women's Education Ban: మహిళా విద్యార్థులు యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించకుండా తాలిబాన్ పాలకులు బ్యాన్ విధించారు. దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థినులు నిరసన తెలుపుతున్నారు. యూనివర్సిటీ గేట్ల ముందు విలపిస్తూ యువతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీని కన్నా తమ తలలు నరకడం మంచిదని అమ్మాయిలు అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ లో జంతువులకు ఉన్న స్వేచ్ఛ మహిళలకు లేదని.. కుక్క కూడా వీధుల్లో తిరుగుతుంది కానీ..అమ్మాయి ఇళ్లకే పరిమితం…