Rahmanullah Gurbaz Helps Homeless Peoples in Ahmedabad: అఫ్గానిస్థాన్ యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. గత నెలలో అఫ్గాన్‌లో భారీ భూకంపం వల్ల నష్టపోయిన అభాగ్యుల కోసం ఫండ్ రైజ్ చేసి అందించిన గుర్బాజ్.. తాజాగా అహ్మదాబాద్ వీధుల్లోని నిరాశ్రయులకు తనవంతు ఆర్థిక సాయం అందించాడు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారికి గుర్బాజ్ నగదు పంపిణీ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్థాన్ క్రికెటర్…
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు కంటే అఫ్గానిస్తాన్ చాలా బెటర్ అని అభిప్రాయపడ్డాడు. "వన్డే ప్రపంచకప్-2023లో మా జట్టు కంటే అఫ్గానిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. అఫ్గాన్స్ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు" అని కార్యక్రమంలో మాలిక్ చెప్పాడు.
ప్రపంచ కప్ 2023లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్‌పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. దీంతో వరల్డ్ కప్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ నిష్క్రమించింది.ా
Pakistan: పాకిస్తాన్‌కి ఆఫ్ఘానిస్తాన్ పక్కలో బల్లెంలా తయారైంది. ముఖ్యంగా తాలిబాన్‌లు నేరుగా పాక్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. రెండు దేశాల సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. 2021 ఆగస్టులో ఆఫ్ఘానిస్తాన్ లోని ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్ పాలన వచ్చేందుకు పాకిస్తాన్ సహకరించింది. ఆ సమయంలో భారత్-ఆఫ్ఘన్ బంధాన్ని దెబ్బతీశామని పాకిస్తాన్ చాలా ఆనందపడింది. ఇక తాలిబాన్ నాయకులు తాము చెప్పినట్లు వింటారని అనుకుంది.
వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశ రాజధాని కాబూల్ నగరంలో బస్సులో పేలుడు సంభవించింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘాన్‌లో మైనారిటీ షియా హాజరా కమ్యూనిటీలు ఎక్కువగా ఉండే దష్ట్-ఎ-బర్చి పరిసరాల్లో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారి ఖలీద్ జద్రాన్ తెలిపారు.
Afghanistan’s ODI World Cup 2023 Semi Final Scenario : ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే భారత్ అధికారిక సెమీస్ బెర్త్ దక్కించుకోగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్ల నిష్క్రమణ కూడా ఖాయం. సెమీస్‌లోని మూడు బెర్తుల కోసం 5 జట్ల మధ్య పోటీ నెలకొంది. 12 పాయింట్స్ ఉన్న దక్షిణాఫ్రికాకు ఓ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. మరో మ్యాచ్ గెలిస్తే…
వన్డే ప్రపంచకప్-2023లో ఆఫ్గానిస్తాన్ మరో విక్టరీ సాధించింది. లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 179 పరుగులు చేసింది. ఈ క్రమంలో 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ షాహిదీ 56 నాటౌట్ పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రెహమత్ షా 52 పరుగులతో రాణించాడు.
ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్ జట్టు.. 179 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన చూపడంతో నెదర్లాండ్స్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసింది.
Pakistan: బాంబు పేలుళ్లతో మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ దద్దరిల్లింది. శుక్రవారం పాక్ వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో పేలుడు జరిగింది. పోలీసులే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. నగరంలోని పోలీస్ పెట్రోలింగ్ రూట్‌కి సమీపంలో బాంబు పేలిందని పోలీస్ అధికారి మహ్మద్ అద్నాన్ తెలిపారు.