Powerful earthquake shakes Afghanistan: అఫ్గానిస్థాన్‌ను భూకంపాలు అస్సలు వదలడం లేదు. మరోసారి అఫ్గాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యుఎస్జీఎస్) వెల్లడించింది. పశ్చిమ అఫ్గానిస్థాన్‌లో హెరాత్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో దాదాపు 8 కిలోమీటర్ల ఉపరితలం కింద ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతంలో రెండు పెద్ద ప్రకంపనలు వచ్చాయని, ఈ ప్రమాదంలో…
Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. బగ్లాన్ ప్రావిన్సు రాజధాని పోల్-ఏ-ఖోమ్రీలోని ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. దేశంలో మైనారిటీ వర్గమైన షియా మసీదులో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. 40 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
నిన్న(బుధవారం) ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా అలవోకగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో టీమిండియా స్టార్ బౌలర్ 4 వికెట్లు తీసి ఆఫ్ఘాన్ స్కోరును కట్టడి చేయగా.. ఇక బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తన బౌలింగ్ లో 4 వికెట్లు సాధించినా.. సంతోషంగా లేనని బుమ్రా చెప్పుకొచ్చాడు. అతను వేసిన 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి నలుగురు ఆటగాళ్లను ఔట్…
వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ విజయాల బాటలో పయనిస్తోంది. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో చెమటోడ్చి గెలిచిన భారత్.. పసికూన అఫ్గానిస్థాన్ జట్టుపై అలవోకగా విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ భారీ శతకాన్ని నమోదు చేయడంతో 15 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది.
వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు రెండు మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు మంచి స్కోరు సాధించింది.
ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబరు 7న ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ ప్రావిన్సుల్లో సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. భూకంపం ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి
Afghanistan Earthquake: పేదరికం, ఉగ్రవాదంతో కష్టంగా బతుకీడుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో శనివారం భారీ భూకంపం సంభంవించింది. హెరాత్ ప్రావిన్సులో సంభవించిన భూకంపం ధాటికి 1000 మందికి పైగా చనిపోయినట్లు తాలిబాన్ అధికారులు ప్రకటించారు. 12 గ్రామాల్లో 600 ఇళ్లు ధ్వంసమైనట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
Earthquake: ఈ రోజు తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడిచింది. అండమాన్ సముద్రంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఆఫ్ఘాన్ కి బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను 37.2 ఓవర్లలో 156 పరుగులకి బంగ్లాదేశ్ బౌలర్లు ఆలౌట్ చేశారు.
China: ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో సరిహద్దు తగాదాలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ జోన్ గా ఉంది. దీంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరుచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.