టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్, ప్రపంచ నెంబర్-1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సుమారు 7 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. చీలమండ గాయం తీవ్రం కావడంతో అతడికి దీర్ఘకాలం విశ్రాంతినివ్వాలని డాక్టర్లు సూచించారు.
Afghanistan :ఆఫ్ఘనిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు ఉదయం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది.
Taliban : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన రాగానే అక్కడ బాలికల విద్యను నిషేధించారు. ప్రజలు తాలిబాన్లకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం మహిళల విద్యపై నిరంతర నిషేధమని డిప్యూటీ విదేశాంగ మంత్రి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ అన్నారు.
Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. పశ్చిమ ఆఫ్ఘాన్లోని హెరాత్ నగరంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. షియా మతగురువులే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. నగరంలోని కోరా మిల్లీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.
Taliban: ముంబై, హైదరాబాద్‌లలో ఆఫ్ఘన్ కాన్సులేట్లను తిరిగి తెరిచామని, తాలిబాన్ విదేశాంగశాఖ డిప్యూటీ పొలిటికల్ మంత్రి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆఫ్ఘన్ కాన్సులేట్లు పనిచేస్తున్నాయని, నేను వారితో మాట్లాడుతున్నానని, వారు రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచారని ఆయన చెప్పారు. తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న జాతీయ టెలివిజన్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాలు కార్యకలాపాలు నిలిపేయడం వాస్తవం కాదని ఆఫ్ఘన్ ఛానెల్…
Pakistan: తాలిబాన్ల వేధింపుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వదిలి పాకిస్తాన్ దేశంలోకి శరణార్థులుగా వెళ్లిన వారి పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్తాన్, తమ దేశం విడిచివెళ్లాలని ఆఫ్ఘన్ శరణార్థులకు డెడ్‌లైన్ విధించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైడ్స్ నిర్వహించి శరణార్థులను గుర్తిస్తోంది. చాలా ఏళ్లుగా పాకిస్తాన్ లో స్థిరపడిన ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఇళ్లు, వ్యాపారం ఇలా అన్నింటిని వదిలేసి మళ్లీ ఆప్ఘనిస్తాన్ వెళ్తున్నారు.
Rahmanullah Gurbaz Helps Homeless Peoples in Ahmedabad: అఫ్గానిస్థాన్ యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. గత నెలలో అఫ్గాన్‌లో భారీ భూకంపం వల్ల నష్టపోయిన అభాగ్యుల కోసం ఫండ్ రైజ్ చేసి అందించిన గుర్బాజ్.. తాజాగా అహ్మదాబాద్ వీధుల్లోని నిరాశ్రయులకు తనవంతు ఆర్థిక సాయం అందించాడు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారికి గుర్బాజ్ నగదు పంపిణీ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్థాన్ క్రికెటర్…
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు కంటే అఫ్గానిస్తాన్ చాలా బెటర్ అని అభిప్రాయపడ్డాడు. "వన్డే ప్రపంచకప్-2023లో మా జట్టు కంటే అఫ్గానిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. అఫ్గాన్స్ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు" అని కార్యక్రమంలో మాలిక్ చెప్పాడు.
ప్రపంచ కప్ 2023లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. దీంతో వరల్డ్ కప్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ నిష్క్రమించింది.ా