Rahmanullah Gurbaz: అఫ్గానిస్థాన్ క్రికెటర్ మంచి మనసు.. అర్ధరాత్రి 3 గంటలకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahmanullah Gurbaz Helps Homeless Peoples in Ahmedabad: అఫ్గానిస్థాన్ యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. గత నెలలో అఫ్గాన్‌లో భారీ భూకంపం వల్ల నష్టపోయిన అభాగ్యుల కోసం ఫండ్ రైజ్ చేసి అందించిన గుర్బాజ్.. తాజాగా అహ్మదాబాద్ వీధుల్లోని నిరాశ్రయులకు తనవంతు ఆర్థిక సాయం అందించాడు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారికి గుర్బాజ్ నగదు పంపిణీ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్థాన్ క్రికెటర్ చేసిన పనికి అభిమానుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
శనివారం తెల్లవారుజామున 3 గంటలకు థాల్తేజ్‌లోని దూరదర్శన్ టవర్ దగ్గర నిరాశ్రయులైన వారికి రహ్మనుల్లా గుర్బాజ్ డబ్బు పంపిణీ చేశాడు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారికి గుర్బాజ్ నగదు పంపిణీ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఘాడ నిద్రలో ఉన్న వారిని లేపకుండా.. వారి పక్కన రూ. 500 నోట్స్ పెట్టుకుంటూ వెళ్ళాడు. ఇందుకోసం పక్కనే ఉన్న ఓ మహిళా సాయం తీసుకున్నాడు. నిరాశ్రయులకు డబ్బు ఇచ్చిన అనంతరం గుర్బాజ్ కారెక్కి వెళ్లిపోయాడు.
Also Read
థాల్తేజ్ వీధుల్లో రహ్మనుల్లా గుర్బాజ్ డబ్బును పంచుతున్న వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఆర్జే లవ్ షా అహ్మదాబాద్‌లోని తన ఇంటి దగ్గర రహ్మనుల్లా గుర్బాజ్‌ను గుర్తించాడు. దీపావళికి ముందు తన ప్రేమను పంచుకున్నాడు. శుక్రవారం ప్రపంచకప్ ప్రయాణం ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంటికి తిరుగు ప్రయాణానికి కొన్ని గంటల ముందు నిరాశ్రయులైన వారికి డబ్బు పంచాడు. ఈ చర్యతో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచావు. ఇలాగే మున్ముందు కొనసాగు’ అని ట్వీట్ చేశాడు.
Also Read: Tiger 3 Crackers: థియేటర్‌లో బాణసంచా కాల్చుతూ.. సల్మాన్ ఫ్యాన్స్ రచ్చ! వీడియో వైరల్
ప్రపంచకప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసిన అఫ్గానిస్థాన్ క్రికెటర్లకు భారత అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. తమ దేశంలో క్రికెట్ అభివృద్ధికి భారత్ సాయం ఎప్పటికీ మరిచిపోలేమని పలు సందర్భాల్లో అఫ్గాన్ క్రికెటర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అఫ్గాన్ యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ తన వంతు సాయం చేశాడు. అఫ్గానిస్థాన్ 9 మ్యాచులలో 4 విజయాలు అందుకుంది. ఓ దశలో సెమీస్ చేరే అవకాశాలు ఉన్నా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.
अफगानिस्तान से आया एक फरिश्ता 🥹
RJ Love Shah spotted @RGurbaz_21 near his home in Ahmedabad, quietly spreading some love ahead of Diwali, hours before the Afghanistan team returned home after their heartwarming World Cup journey ended on Friday night.
🎥: RJ Love Shah |… pic.twitter.com/TOeUBKwXwh
— KolkataKnightRiders (@KKRiders) November 12, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!