Afghanistan: భారత్ లో శాశ్వతంగా మూతపడ్డ ఆఫ్ఘన్ దౌత్య కార్యాలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని అఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ రాయబారి ఇవాళ ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి ఎదురైన నిరంతర సవాళ్ల కారణంగానే నిన్నటి (నవంబర్ 23 వ తేదీ ) నుంచి న్యూఢిల్లీలోని తమ దౌత్య కార్యాలన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇక, గత సెప్టెంబర్ 30వ తేదీన ఆఫ్ఘన్ ఎంబసీ కార్యకలాపాలను అంతకుముందు నిలిపివేశామని ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ తెలిపారు.
Read Also: Israel-Hamas war: స్వాప్ డీల్ అంగీకరించిన ఇజ్రాయెల్.. బందీల విడుదల జాబితాను అందించిన హమాస్
Also Read
- Supreme Court: "ఒక్క సెప్టెంబర్లోనే 13 అత్యాచారాలు".. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
అయితే, న్యూఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్ఘానిస్థాన్ ఎంబసీ కొనసాగింపు కోసం భారత ప్రభుత్వ వైఖరి అనుకూలంగా అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఉన్నామని ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎనిమిది వారాల నిరీక్షణ తర్వాత, దౌత్యవేత్తలకు వీసా పొడిగింపు జరగలేదని అప్ఘన్ అంబాసిడర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అఫ్ఘానిస్తాన్ దేశంలో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో తీవ్రమైన మార్పు వచ్చిందన్నారు. అయితే, గత రెండు సంవత్సరాలలో భారతదేశంలో నివసిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గిందని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 2021 నుండి ఆఫ్ఘన్ శరణార్థులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్లడంతో ఈ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. ఈ కాలంలో చాలా పరిమితమైన కొత్త వీసాలు జారీ చేయబడ్డాయని పేర్కొనింది.
తాజావార్తలు
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!