ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌లపై అమెరికా 20 ఏళ్ల పాటు జరిపిన పోరాటంలో పాకిస్తాన్ భాగస్వామ్యం కావడంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా.. కేవలం డబ్బు కోసమే అమెరికాతో తమ దేశం అప్పట్లో చేతులు కలిపిందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ”ఇతరులు మనల్ని వాడుకునేందుకు నాడు మనమే అవకాశమిచ్చాం. దేశ ప్రతిష్టను పణంగా పెట్టాం. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా, డబ్బు…
తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్ తెలిపారు. ఈ బడ్జెట్ కోసం రెండు దశాబ్దాలలో మొదటిసారిగా విదేశీ సహాయం లేకుండా నిధులుసమకూరుస్తున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ 2022 వరకు అమలయ్యే బడ్జెట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కూరుకుపోయిన ఆప్ఘాన్‌కు ఈ బడ్జెట్ చాలాముఖ్యమైనది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక చాలా బ్యాంకులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకులు భగ్గుమంటున్నాయి.…
ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్ సాయం అందించేందుకు పాకిస్తాన్ తన షరతుల జాబితాను భారత్‌కు పంపించింది. ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయంగా వాఘా ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు,ప్రాణాలను రక్షించే మందులను రవాణా చేయడాన్ని అనుమతిస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ నిబంధనలు విధించింది. ఇప్పుడు ఇస్లామాబాద్ పెట్టిన రెండు షరతులు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటి, సామాగ్రిని పాకిస్తానీ ట్రక్కుల ద్వారా రవాణా చేయాలని పాక్ పట్టుబడుతుంది. భారతీయులు కాకపోతే కనీసం ఆఫ్ఘన్ ట్రక్కులు మెటీరియల్‌ని ఆఫ్ఘనిస్తాన్‌కు…
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం జరిగిన పేలుడులో కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని అక్కడి స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమ కాబూల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్ 5లో సోమవారం ఉదయం ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. ఈ పేలుడుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన దుకాణదారుడు అహ్మద్ ముర్తాజా వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, తాను కస్టమర్‌తో బిజీగా ఉన్నానని, “తన స్టోర్‌ను కదిలించిందని చెప్పాడు”. పేలుడు జరిగిన…
షెడ్యూలింగ్ కారణాలను” పేర్కొంటూ, యుద్ధంతో దెబ్బతిన్న ఆప్ఘాన్ దేశ పరిస్థితులపై భారతదేశం నిర్వహించిన ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేష న్‌నుకు చైనా గైర్హాజరైంది. దాని మిత్ర దేశమైన పాకిస్తాన్ ఏర్పాటు చేసిన సమావేశానికి చైనా హాజరైయింది.దీంతో డ్రాగన్ ఆడుతున్న డ్రామాలు మరోసారి బయట పడ్డాయి. ఈ విషయం పై ఇప్పటికే భారత్ చైనాను వివరణ కోరింది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని చర్చించడానికి ఇస్లామా బాద్‌లో అమెరికా, చైనా,రష్యాలకు చెందిన సీనియర్ దౌత్య వేత్తలకు పాకిస్తాన్ గురువారం ఆతిథ్యం…
ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకూడదని ఎనిమిది దేశాలు ఆమోదించిన ఉమ్మడి ప్రకటనను అజిత్ ధోవల్ బుధవారం విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్‌పై మూడవ ప్రాంతీయ భద్రతా సంభాషణలో భాగంగా 7 దేశాల NSAలు ప్రకటనను ఆమోదించాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ ప్రాతినిథ్యం వహించిన సెక్యూరిటీ ఆన్ ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేషన్ లో ఇరాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్‌లు పాల్గొన్నాయి. చర్చల్లో చేరాల్సిందిగా చైనా, పాకిస్థాన్‌లను…