MLA Adinarayana Reddy: బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి.. వైసీపీ నేతలకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అమరావతికి వస్తున్నా.. చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.. బుధవారం లేదా గురువారం అమరావతికి వస్తానని ప్రకటించారు.. ఈనెల 4న రాష్ట్రంలో అభివృద్ధి, వైసీపీ అవకతవకలపై మాట్లాడాను.. నాపై వ్యక్తిగతంగా రకరకాలుగా రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, రామసుబ్బారెడ్డి చాలా కామెంట్లు చేసారు.. నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పకుండా, జగన్ మెప్పు కోసం సంబంధం లేని మాటలు మాట్లాడారని…
ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ని విమర్శించే స్థాయి ఆదినారాయణ రెడ్డికి లేదన్నారు. అధికారం లేకపోతే పిల్లిలా ఉండే ఆదినారాయణ రెడ్డి.. ఇప్పుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అవసరాన్ని బట్టి పార్టీలు మార్చే వ్యక్తి అని విమర్శించారు. చికెన్ షాపుల్లో కూడా కమీషన్లు కొట్టేసే స్థాయి ఆదినారాయణ రెడ్డిది అని ఎద్దేవా చేశారు. జగన్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటానికి…
పుష్యం ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం దేవగుడి. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పనిచేయగా షేక్ మదీన్ సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ చేశారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు…
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ జిల్లాలో ఫైయాష్ కోసం గొడవలు మొదలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫైయాష్ కోసం ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తమలో తామే దాడులకు పాల్పడ్డారు. ఎర్రగుంట్ల మండలం లోని థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్లైయాస్ కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. పాండ్ యాష్ ప్లాంట్ లో లోడింగ్ అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం.…
వైసీపీ పార్టీలో ఉండలేకే విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చినందుకు తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ఏ2 విజయసాయి రెడ్డి, ఏ1 జగన్ రెడ్డి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్లు అప్పులు, తప్పులు చేశారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఓ డైనోసార్ అని, జగన్ సార్ బేకార్ అని విమర్శించారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయవద్దని, ప్రజలు…
బూడిద లోడింగ్, తరలింపు వ్యవహారం కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టింది.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు, సరఫరాపై వివాదం రోజురోజుకు ముదురుతోంది.. బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని మండిపడ్డారు..
ఆ వ్యక్తిపై పార్టీకి నమ్మకం లేదా? పార్టీని భుజాన వేసుకుని తిరుగుతున్నా అధిష్ఠానం నమ్మడం లేదా? సొంత కుటుంబం నుంచే ఆ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్ ఇబ్బందిలో పడబోతుందా? ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరిన ఆదివైసీపీలో గెలిచి టీడీపీలో చేరి.. మంత్రి పదవి పట్టేశారు ఆదినారాయణరెడ్డి. మంత్రి అవడమే జిల్లా మొత్తం పెత్తనం చేశారు. పార్టీ అవసరాలలో భాగంగా ఆగర్భ శత్రువు రామసుబ్బారెడ్డితో రాజీ పడి 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు వదిలి కడప ఎంపీగా…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి… అసలు దళితులు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… వైసీపీ దళిత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దళితుల గురించి అవహేళనగా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డిని బద్వేల్ ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు… దళితులకు నాగరికత లేదని మాట్లాడే ఆదినారాయణరెడ్డికి అసలు దళితుల ఓట్లు అడిగే హక్కులేదన్న ఆయన.. దళితులు ఎవ్వరూ బీజేపీకి…