MLA Adinarayana Reddy: బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి.. వైసీపీ నేతలకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అమరావతికి వస్తున్నా.. చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.. బుధవారం లేదా గురువారం అమరావతికి వస్తానని ప్రకటించారు.. ఈనెల 4న రాష్ట్రంలో అభివృద్ధి, వైసీపీ అవకతవకలపై మాట్లాడాను.. నాపై వ్యక్తిగతంగా రకరకాలుగా రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, రామసుబ్బారెడ్డి చాలా కామెంట్లు చేసారు.. నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పకుండా, జగన్ మెప్పు కోసం సంబంధం లేని మాటలు మాట్లాడారని మండిపడ్డారు.. విశాఖ సమ్మిట్ లో పది లక్షల కోట్ల పెట్టుబడులు, పది లక్షల ఉద్యోగాలు వస్తాయి.. కానీ, మీ బ్రతుకంతా SIT ఎదుట అటెండ్ అవడానికే సరిపోతోందని ఎద్దేవా చ ఏశారు.. నేను వైసీపీ ఆఫీసుకు రమ్మన్నా వస్తా… చర్చకు సిద్ధం.. అని ప్రకటించారు..
Read Also: CM Revanth Reddy: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు- ఆకట్టుకుంటున్న సైకత శిల్పం
R కాంగ్రెస్ పోయింది, I కాంగ్రెస్ పోయింది, Y కాంగ్రెస్ కూడా పోతుంది… వైసీపీ ఈ రాష్ట్రంలో ఉండదు… ఆకాశం అంత సంపాదన మీది.. మీరు చేసిన సాయం ఆవగింజంత అని విమర్శించారు ఆది నారాయణరెడ్డి.. రాజారెడ్డి మిలిటరీలో వంట మాస్టర్ గా చేసింది కూడా చెప్పాలి.. మా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక జనతా పార్టీ అభ్యర్ధిగా టికెట్ తెచ్చుకున్నా… రామసుబ్బారెడ్డి రిగ్గింగ్ చేస్తుంటే.. నేను గెలిచాను అన్నారు.. అమరావతి, పోలవరం, రైల్వేజోన్, ప్రైవేటు కంపెనీల పెట్టుబడులూ ఆపలేరు… జైలుకు పోకుండా ఆగలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. చెత్త సంప్రదాయంతో మీరు నాకు కౌంటర్ ఇచ్చారు.. ఏ కేసులూ మీరు ఆపలేరు… టైంపాస్ కాదు.. రాష్ట్రం బాగుపడాలి అన్నారు.. ఇక, మన్మోహన్ సింగ్ వదిలిన 11వ స్ధానం నుంచి దేశం 2వ స్ధానానికి రానుంది అని వెల్లడించారు.
పులివెందుల స్ధానిక ఎన్నికల్లో నేనే దగ్గరుండి ఎలక్షన్లు చేయిస్తా.. పులివెందుల మీ పులులు ఆపగలరా..? అని సవాల్ చేశారు ఆది నారాయణరెడ్డి.. సతీష్ రెడ్డి మీద కూడా వివేకా హత్య విషయంలో ఆరోపణలు చేసారు.. వివేకా కేసులో కమింగ్ సూన్ ముద్దాయిలు.. పోకిరి సినిమాలో ఉప్మా జోక్ లాగా, కుటుంబం.. కుటుంబం.. గుండెపోటుతోనే పోతారా? అని ప్రశ్నించారు.. వైసీపీ అంతరించిపోయేలా ఉంది… లోకల్ బాడీ ఎలక్షన్లలో.. 2029 ఎన్నికల్లో కూటమి అంతరిక్ష స్ధాయికి, వైసీపీ అంతరించే స్థాయికి వెళ్లిపోయిందని సెటైర్లు వేశారు.. IIT ర్యాంకు తెచ్చుకున్న వ్యక్తిపై, ITI ఫెయిల్ అయిన వాడు మాట్లాడిన్నాయి మీ మాటలు… మా కూటమి పండుగలా పండుతుంది.. మీ పార్టీ ఎండుటాకులా ఎండుతుంది అని వ్యాఖ్యానించారు.. తప్పు చేస్తే సోషల్ మీడియాను శిక్షించడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టారని తెలిపారు.. ఇక, డిబేట్ కు వెల్కం.. అసెంబ్లీకి రా.. నువ్వే డేట్ నిర్ణయించు.. నేను రెడీ.. చచ్చుగా చేసేకంటే.. చచ్చేది మేలు.. తాడేపల్లి డిబేట్ అంటే… జగన్ ఇంటికే వెళతా అని ప్రకటించారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి..