ఏపీలో ఎన్నికలకు ముందే పొత్తుల గురించి ప్రస్తావన హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో కలిశారు జనసేనాని పవన్ కళ్యాణ్. తాజాగా బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా జమ్మలమడుగు లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో తెదేపా, భాజపా, జనసేన మూడు పార్టీలు కలిసి పనిచేయనున్నాయని మాజీ మంత్రి భాజపా ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా జమ్మలమడుగు లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం తర్వాత ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి, జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Read Also:Heavy Rains In Telugu States Live:తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీవర్షాలు
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మోడీ భేటీ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ జరిగిందని వివరించారు.వివేకానంద రెడ్డి హత్య, కోడి కత్తి సంఘటనలో వాస్తవాలు బయటికి రావడంతో ఎవరు నిందితులో అందరికీ తెలిసిందన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి…. వైయస్ అనే బ్రాండ్ ను పూర్తిగా చెడగొట్టారని ఆయన కుటుంబ సభ్యులే విమర్శించారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.వచ్చే ఎన్నికల్లో తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగుతానని వివరించారు.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్