Nagoba Jatara: నేడే నాగోబా జాతర మొదలు.. మహా పూజతో జాతర షురూ
- నేటి నుంచే నాగోబా జాతర మొదలు.
- రాత్రి జరిగే మహా పూజతో జాతర షురూ.
- ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా గుడి వద్ద నేడు నాగోబా మహా పూజల జాతర ఘనంగా ప్రారంభం కానుంది. రాత్రి మహాపూజతో జాతర ఆరంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. మెస్రం వంశీయులు సంప్రదాయరీతిలో ఈ జాతరలో పాల్గొననున్నారు. నాగోబా మహా పూజ ప్రత్యేకంగా నాగోబా దేవుడి పూజార్చనతో ప్రారంభమవుతుంది. మహాపూజ అనంతరం తెల్లవారుజామున కొట్టకోడళ్ళ బేటింగ్ (దేవుడికి పరిచయం చేసే సంప్రదాయం) నిర్వహించనున్నారు. ఇది వంశీయ సంప్రదాయానికి ఎంతో ప్రత్యేకమైన ఆచారం.
Also Read: Nalgonda: బీఆర్‌ఎస్ రైతు మహా ధర్నా.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్
Also Read
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
జాతరలో భాగంగా, కేస్లాపూర్‌లోని మర్రిచెట్టును పూజించిన అనంతరం మెస్రం వంశీయులు గోవాడ్ వద్దకు చేరుకుంటారు. కోనేరు నుంచి కొత్త కుండలతో నీటిని తీసుకొచ్చి పుట్టను తయారు చేయడం వంశ ఆడపడుచులు, అల్లుళ్ల సంప్రదాయ విధిగా నిర్వహిస్తారు. మహాపూజ తర్వాత తెల్లవారుజామున కొట్టకోడ్ళ బేటింగ్, మరుసటి రోజు పెర్సాపెన్, భాన్‌పేన్ పూజలు, చివరగా ముగింపు పూజ మండగాజలి పూజతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగుస్తాయి. ఈ నెల 31న నాగోబా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈ దర్బార్‌లో నాగోబా వంశీయులు తమ సమస్యలను వర్గపెట్టి చర్చిస్తారు. ఇది వంశీయుల సమాగమానికి ప్రత్యేకమైన భాగం.
ఇక ఈ జాతరను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రాకపోకలు సులభంగా ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు, పూజా కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమకూర్చారు. ఈ నాగోబా జాతర మెస్రం వంశీయుల సంప్రదాయ ఆచారాలను నిలబెట్టడంలో కీలకంగా ఉంటుంది. భక్తులందరికీ ప్రత్యేక అనుభూతిని అందించే ఈ జాతర మహత్తరంగా సాగనుంది.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!