Nirmal: కూతురు పుట్టిన కొద్దిరోజులకే తండ్రి చనిపోయాడు.. అయితే ఆ కూతురికి అన్నీ తానే ఉండి చూసుకుంది ఓ తల్లి. కూతురి ఆలనా పాలనా చూసుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చింది. ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు.. ఆ తల్లి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమైంది. అయితే తన కన్న కూతురు ఏమైపోతుంది అనే మాట మరిచిపోయింది. ఆర్థిక పరిస్థితులతో కుటుంబాన్ని, తన కూతురుని పెంచలేను అనుకుందో ఏమో ఇంట్లో కూతురు లేని సమయంలో…
క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి పూర్తిస్థాయి మార్గదర్శకాలతో ‘రైతుభరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుండి అభిప్రాయాలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
ఓ యువకుడు సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Adilabad: నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు వెతకడం, పోలీసులే లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై దాడి చేయడం... ఇదీ జాగిలం తార పని. కానీ ఈ పనులు చేయడానికి వారికి చాలా శిక్షణ ఇవ్వాలి.
Adilabad Teacher Murder Update: ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం పర్సువాడ వద్ద జూన్ 12న ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గజేందర్ స్వస్థలం నార్నూర్ మండలం నాగులకొండ కాగా.. జైనథ్ మండలం కెనాల్ మేడిగూడలో టీచర్గా పని చేస్తున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించారు. గజేందర్ హత్యపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు…
పోలీసులు కనీసం మానవత్వం లేకుండా ఆ ఇష్యూతో సంబంధం లేని వాళ్ళను సైతం ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చారు.. తప్పుడు కేసులు ఎత్తి వేయాలి అని డిమాండ్ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎంపీ నగేష్ కోరారు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను మూడుచోట్ల ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
Telangana Lok Sabha Elections 2024 Results: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఏడు నియోజక వర్గాలు ఉన్నాయి. జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను మూడు చోట్ల…