Lawrence Bishnoi: పంజాబ్‌లోని భటిండా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఆరోగ్యం క్షీణించింది. బిష్ణోయ్‌ని ఫరీద్‌కోట్‌లోని గురుగోవింద్ సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు.
ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. నిందితుడు సాహిల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించి 640 పేజీల ఛార్జ్ షీట్‌ను దాఖలు చేశారు.
ఢిల్లీలోని వికాస్ పురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు పోలీసులు మంగళవారం గుర్తించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని సీసీ కెమెరాల్లో గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు. ఈ నేరానికి సంబంధించి సోమవారం వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
నాగర్‌కోయిల్ కేసు నిందితుడు కాశీకి జీవిత ఖైదు శిక్ష విధించారు. మహిళలను మభ్యపెట్టి అసభ్యకర వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులు వసూలు చేసిన కేసులో నాగర్‌కోయిల్ కాశీకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
Protest : ప్రాణంగా ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట యముడిగా మారాడు. నమ్మి తనతో వెళితే చంపి నదిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్టు ఆత్మహత్యగా చిత్రీకరించబోయాడు. కానీ కుమార్తె మృతి పై అనుమానం వచ్చి ఆమె ప్రియుడి ఇంటి ఎదుట తల్లి ధర్నాకు దిగింది.
గుజరాత్‌లోని నరోడా గ్రామ్ ఊచకోత కేసులో హ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో నరోదా గామ్‌లో 11 మంది చనిపోయారు. ఈ కేసులో గుజరాత్ మంత్రి మాయా కొద్నానీ నిందితురాలిగా ఉన్నారు.
Vakapalli Case: వాకపల్లి ఆదివాసీ మహిళల అత్యాచారం కేసును కొట్టేసింది విశాఖ సెషన్స్ కోర్టు. విచారణలో నేరం రుజువు కాలేదని తెలిపింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని లీగల్ సెల్ అథారిటీని ఆదేశించింది. 2007 ఆగస్టులో విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లిలో ఈ ఘటన జరిగింది. కుంబింగ్ కోసం వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం అత్యాచారాలకు పాల్పడిందని కేసు నమోదు చేశారు. మానవాహక్కులు, పౌర సంఘాలు కల్పించుకోవడంతో వివిధ దశల్లో విచారణ జరిగింది. అయితే, కేసు విచారణ…
టీఎస్‌పీఎస్ పేపర్ లీకేజ్ కేసులో నిందులను అదుపులో తీసుకున్న సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కొందరికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు పలువురు నిందితులను అదుపులో తీసుకున్న సిట్ ఇవాళ షమీమ్, సురేష్, రమేష్ లను రెండో రోజు విచారించున్నారు.
YS Viveka murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.. నిందితులను ఇవాళ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు.. దీనికోసం కడప జైల్లో ఉన్న నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిలను ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున 4 గంటలకు కడప జైలు నుంచి హైదరాబాద్‌కు…