లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏ31 రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి.
లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఇప్పటికే కీలక నేతల అరెస్ట్ వ్యవహారం కాకరేపుతుండగా.. తాజాగా, లిక్కర్ స్కాం కేసులో నిందితుల అరెస్ట్ కోసం వారెంట్ పిటిషన్లు దాఖలు చేసింది సిట్.. మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేయటం కోసం అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు..
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లిలో ఓ మైనర్ బాలికపై రెండేళ్లుగా వేర్వేరుగా 14 మంది కామాంధులు అత్యాచారం చేసిన ఘటనల తీవ్ర కలకలంరేపుతోంది.. అయితే, ఈ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది.. గతంలోనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా, మరో ఏడుగురు నిందితులు అరెస్ట్ చేసిన రామగిరి పోలీసులు.. పుట్టపర్తిలో జిల్లా ఎస్పీ ఎదుట నిందితులను హాజరుపరిచారు..
గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన రౌడీషీటర్ అనుచరులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నెల రోజుల క్రితం ఐతానగర్‌లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడిచేశారు రౌడీ షీటర్ లడ్డూ అనుచరులు విక్టర్, బాబూలాల్, రాకేష్.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు తెనాలి టూ టౌన్ పోలీసులు. నిందితులను ఐతానగర్ తీసుకెళ్లి నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చారు పోలీసులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈనెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రామకృష్ణ తన పంచాయతీ పరిధిలో అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే, వైసీపీకి చెందిన కే వెంకటరమణ హత్యకాబడిన రామకృష్ణతో ఫిబ్రవరి 10వ తేదీన గొడవపడ్డాడు. రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు ప్రత్యార్థులనుంచి ప్రాణహాని ఉందని సీఐకి ఫిర్యాదు చేసిన ముందస్తు…
రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రంగారెడ్డి ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిపై ముద్దాయి చెప్పు విసిరాడు. ఫోక్సో కేసులో ముద్దాయిగా ప్రకటించడంతో జిర్ణించుకోలేకపోయిన నిందితుడు.. న్యాయమూర్తిపై ఒక్కసారిగా చెప్పు విసిరాడు. కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాది.. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో కోర్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళపై తన స్నేహితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా.. తనకు మత్తు మందు ఇచ్చి.. అత్యాచారం చేసిన ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తుున్నాడని బాధితురాలు సోమవారం పోలీసులకు తెలిపింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై పశ్చిమబెంగాల్‌లోని సీల్దా కోర్టు అభియోగాలు మోపింది. సంజయ్ రాయ్‌పై భారతీయ న్యాయ్ సహిత 103(1) లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపింది.
Fake Court: ఇప్పటి వరకు మనం చాలానే ఫేక్ ఐపీఎస్, ఫేక్ ఆఫీస్ విషయాలు సంబంధించిన విషయాలను చూసాము. ఇక తాజాగా ఇప్పుడు నకిలీ కోర్టు, జడ్జి గుట్టు బట్టబయలైంది. ఈ కేసులో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో నకిలీ కోర్టు పట్టుబడింది. వృత్తిరీత్యా నకిలీ జడ్జిగా, లాయర్‌గా నటిస్తూ గత కొన్నేళ్లుగా ఈ మోసం వ్యాపారం సాగుతోంది. అసలు విషయం తెలియగానే ప్రజలు షాక్ అవుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నకిలీ న్యాయమూర్తిపై కఠిన చర్యలు…