రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
శనివారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (ఎస్‌ఎఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొని బోల్తాపడడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా., మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ కు తీవ్ర గాయాలు కాగా., అతడిని సమీపంలోని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. సియోని జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని – మండ్లా రాష్ట్ర రహదారిపై ధనగధ…
Hit and Run: కొందరు యువత సెల్ఫీల కోసం ప్రమాదకర పనులు చేస్తుంటారు. కొంత మంది లైక్స్ రావడానికి.. ఫేమస్ కావడానికి రీళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎగిరిపడ్డారు.
పరిమితికి మించి ప్రయాణం.. మితిమీరిన వేగం.. ప్రమాదానికి కారణమైంది. పొలానికి వెళ్లి తిరిగివస్తున్న కూలీలను గాయాల పాలు చేసింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో టైరు పగిలి కూలీలు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది.
చైనాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్లో మంగళవారం ప్రయాణికుల బస్సు సొరంగం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ముఖ్యమంత్రిని హుటాహుటిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఆ యువకుడు అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు ఆ యువకుడిని కబలించివేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ (27) సోమవారం రాత్రి 11.30 లకు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.