Road Accident: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారి సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి తుని వైపు వెళ్తోన్న కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో నక్కపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను విశాఖ నగరంలోని గోపాలపట్నం వాసులుగా గుర్తించారు. మృతులు వైఎస్సాఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డెడ్ ప్రసాద్ బంధువులు అని సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Crime Case: ఇదెక్కడి మాస్ మావా.. సినిమా రేంజిలో పోలీసుల స్కెచ్.. ముఠా గుట్టు రట్టు..