నూతన సంవత్సర వేడుకలు ముగ్గురు యువకుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఏలూరు జిల్లాలో న్యూఇయర్ రోజున విషాదం చోటుచేసుకుంది. అగిరిపల్లి మండలం కనసానపల్లిలో మద్యం మత్తులో బుల్లెట్ బండి నడుపుతూ బావిలోకి దూసుకెళ్లాడు ఓ యువకుడు. బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
12 dead in China Coal Mine Accident: భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి చైనా ప్రజలు తేరుకోకముందే.. ఆ దేశంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో సంభవించిన పెను ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చైనాలోని ఈశాన్య ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు ప్రకారం… హెంగ్షాన్ జిల్లా జిక్సీ నగరంలోని కున్యువాన్ బొగ్గు గనిలో బుధవారం ప్రమాదం…
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చి కారు ఇసుక లారీ ఢీ కొన్నాయి.. కారులో ప్రయాణిస్తున్న ఏటూరు నాగరంకు చెందిన నలుగురు మృతి చెందారు..
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు తగలడంతో ఆసుపత్రిలో చేరారు.. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే కారణమని పోలీసుల ప్రధాన విచారణలో తేలింది.. వివరాల్లోకి వెళితే.. ఉల్హాస్‌నగర్‌లో తెల్లవారుజామున తన SUVని రెండు ఆటోరిక్షాలు మరియు మరో నాలుగు చక్రాల వాహనంపై ఢీకొట్టిన వ్యక్తిని థానే పోలీసులు అరెస్టు చేశారు, ఫలితంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు మరియు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.. పోలీసులు…
Viral Video: ప్రస్తుతం రోడ్డుపైకి వెళ్లడం అనేది ఒక సవాలుగా మారింది. జాగ్రత్తగా ముందుకు సాగకపోతే ప్రమాదం తప్పదు. చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారుతుంది.
పశ్చిమ బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్ అటవీప్రాంతంలో ఈరోజు పార్శిల్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మూడు ఏనుగులు చనిపోయాయి. రాజభట్‌ఖావా, కాల్చిని రైల్వే స్టేషన్‌ల మధ్య శిఖరి గేట్ సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగింది.
4 Injured in Vijayawada Car Racing: ఏపీలోని విజయవాడ నగరంలోని జాతీయ రహదారిపై శనివారం (నవంబర్ 18) అర్ధరాత్రి కార్ల రేసింగ్ జరిగింది. బెంజ్, ఫార్చ్యూనర్ కార్లతో యువతీ, యువకులు రేస్ నిర్వహించారు. ఐఈపీఎల్ ఐనాక్స్ ఎదురుగా రెండు కార్లు అతివేగంగా దూసుకొచ్చాయి. ఓ ఫార్చూనర్ కారు అదుపుతప్పి రామవరప్పాడు వైపు వెళ్తున్న 2 స్కూటీలను ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలైన వీరిని స్థానికులు వేంటనే…
Small Plane crashes into car in America: అగ్ర రాజ్యం అమెరికాలో ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన టెక్సాస్ రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. అతడిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇద్దరు విమానంలో ఉండగా.. ఒకరు కారులో ఉన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శనివారం…
4 dead and several injured in Rajasthan Bus Accident: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో అదుపు తప్పిన ఓ బస్సు.. బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్ (రైలు పట్టాలు)పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు…
తాగిన మత్తులో నిర్లక్ష్యంగా, అతివేగంగా టాటా ఇన్ఫ్రా వ్యాన్ డ్రైవింగ్ చేస్తూ పాదాచరులను, రెండు ద్విచక్ర వాహన దారులను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా... నలుగురికి గాయాలయ్యాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ లో breaking news, latest news, telugu news, accident