తెలుగు సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం మృతి చెందారు.మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో పవిత్ర అక్కడిక్కడే మరణించారు.కర్ణాటకలోని తన సొంత వూరుకి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా తన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు సమాచారం.
ఆమెతో పాటు కారులో తన తోటి నటులు మరియు కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనలో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ మరియు నటుడు చంద్రకాంత్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పవిత్ర జయరాం తెలుగులో త్రినయని సీరియల్ తో ఎంతగానో ఫేమస్ అయ్యారు.సీరియల్స్ లో విలన్ పాత్రలలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన పవిత్ర కన్నడలో “రోబో ఫ్యామిలీ” సీరియల్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది .