పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపురం నుంచి దువ్వాడకు చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ తాడేపల్లిగూడెం వద్ద బోల్తా కొట్టింది. లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు మరో 6గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై లారీ బోల్తా కొట్టడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్…
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 19 అంతస్తులున్న ఓ అపార్ట్‌మెంట్‌లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 60 మందికి గాయాలయ్యాయి. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతిచెందిన 19 మందిలో 9 మంది చిన్నారులు ఉన్నారు. మొదటి రెండు అంతస్తుల్లో అగ్నిప్రమాదం జరగడంతో మిగతా అంతస్తులలో నివశిస్తున్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. Read: నకిలీ సర్టిఫికెట్‌లపై…
ఎన్ని కఠిన ఆంక్షలు విధించిన, చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని శిక్షలు పడుతున్నాకానీ కొందరు మారడం లేదు. వారి జల్సాల కోసం మరొకరి ప్రాణాలు తీస్తూ నిందితులుగా మారుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దంటూ ప్రభుత్వాలు, పోలీసులు చెబుతున్నా పెడచెవిన పెడుతూ ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. అలాంటి ఘటనే ఘట్‌కేసర్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి నిఖిల్‌రెడ్డి మద్యం సేవించి అతి వేగంగా కారు నడుపుతూ ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్…
ఓఆర్ఆర్ నుంచి కోదాడ వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. కారు వెనుకనుండి ఢీకొట్టింది లారీ. వాళ్లని హాస్పటల్ కు తరలించే సమయంలో మరో కారు ఆగింది. అంతేకాదు, ఆ కారు వచ్చి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. గాయపడ్డవారు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.…
వీకెండ్ వచ్చిందంటే చాలు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. మందేసి చిందేసి రోడ్లమీదకి వచ్చి మరీ అమాయక జనం ప్రాణాలు తీసేస్తున్నారు.మొయినబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రాణం బలయింది. మొయినబాద్ నుండి చేవెళ్ల వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రేమిక (16) ఘటన స్థలంలోనే మృతిచెందింది. ప్రస్తుతం సౌమ్య,అక్షర గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మరో 24 గంటలు గడిస్తే…
సింగరేణిలో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి… తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్‌ను మరో డంపర్ ఢీకొట్టిన ప్రమాదంలో.. ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు.. అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు…
నటి మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆమె అభిమానులను కంగారుపెట్టింది. తనకు రక్తం కారేలా గాయాలయ్యాయని, చేతి వేళ్లకు కూడా దెబ్బలు తగలడంతో రక్తం వచ్చిందని మంచు లక్ష్మీ ఆదివారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీంతో మంచు లక్ష్మీకి అసలు ఏమైందంటూ అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే రియల్ యాక్సిడెంట్ కాదని… రీల్ యాక్సిడెంట్ అని తెలుస్తోంది. Read Also: ప్రస్తుతం మంచు లక్ష్మీ చేతినిండా సినిమాలతో…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని కాపాడుకునేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇన్నుయిర్ కాప్పొమ్ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రకారం, రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించాలని, రోడ్డు ప్రమాదం బారిన పడిన వ్యక్తిని కాపాడేందుకు మొదటి 48 గంటలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. Read: ముంబైలో కాంగ్రెస్ సభపై నీలిమేఘాలు……
ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జల్లేరు వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో 10 మంది నీట మునిగి మృతిచెందగా… 30 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి జంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాదానికి కారణం కచ్చితంగా తెలియకున్నా.. ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను తప్పించపోయి బస్సు వాగులో పడిందంటున్నారు అందులోని ప్రయాణికుడు.…