పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంత్రి తలసాని కుమారుడిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. ఖైరతాబాద్‌లో జరుగుతున్న సదర్ ఉత్సవాలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారు తలసాని సాయికిర్‌ణ్ తన కారులో వచ్చారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్ వస్తుండగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఇందిరానగర్‌కు చెందిన సంతోష్ (32) అనే వ్యక్తి పాదం పై నుంచి ఆయన కారు పోవడంతో ఆ వ్యక్తి గాయాలయ్యాయి. దీంతో సదరు బాధితుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో తలసాని సాయికిరణ్‌పై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు…
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎనిమిది మంది ఉండగా.. ముగ్గురు స్పాట్ లోనే మరణించారు. అయితే.. మృతి చెందిన వారిలో శుశాంక్ అనే బాలుడు ఉండటం…
భయం చాలా ప్రమాదకరమైనది. పూర్తి అవగాహన లేకుండా కొన్ని సార్లు భయపడితే ప్రాణాల మీదకే రావచ్చు.. ఏకంగా ప్రాణాలే కోల్పోవచ్చనేదానికి ఈ ఘటనే నిదర్శనం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన పొనగంటి వేణు అనే యువకుడు సంఘమిత్ర కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం కావడంతో నిన్న రాత్రి హుజురాబాద్ రోడ్‌లో గల అభిరామ్ బార్ ఎదురుగా ఉన్న రోడ్డు లోపల స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన…
ఎన్ని ప్రమాదాలు జరగుతున్న వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. వేగం కన్నా ప్రాణం మిన్నా అనే సూత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తమవి పెద్ద పెద్ద బండ్లు అనో, ఖరీదైన బైకులు, కార్లను స్లోగా నడిపితే ప్రయోజనం ఏంటని అనుకుంటున్నారో తెలియదు కానీ రోజు రోజుకు వాహన ప్రమాదాలు మరీ ఎక్కువై పోతున్నాయి. ఎంతో జీవితం ఉన్న యువతీ, యువకులు మధ్యలోనే జీవితాన్ని ముగించాల్సి వస్తోంది. కొంచెం లేటైనా గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న విషయాన్ని మరిచిపోతూ…
మితిమీరిన వేగం ఓ మహిళ ప్రాణం తీసింది. నార్సింగి మీర్జాగూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన కారు వేగంగా ముందుకు వెళ్ళబోయింది. స్పాట్ లోనే మృతి చెందింది ఓ మహిళ. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు. కారు వదిలేసి పారిపోతున్న డ్రైవర్ ను వెంబడించి పట్టుకున్న స్థానికులు. దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలు అదే ప్రాంతానికి చెందిన పద్మగా గుర్తించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా…
గత నెల 12వ తేదిన విధులు ముగించుకోని ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న (23)అనే మహిళ కానిస్టేబుల్ సెప్టెంబర్ 12న విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలు దేరింది. అయితే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్ పైకి రాగానే అనుకోకుండా జ్యోత్స్న నడుపుతున్న…
నేపాల్‌లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. దసరా సందర్భంగా వలస కార్మికులు నేపాల్‌లోని గంజ్ నుంచి ముగు జిల్లాలోని గామ్‌గధికి వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉన్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. బస్సు ఛాయనాథ్ రారా పట్టణాన్ని దాటగానే అదుపు తప్పి 300 అడుగుల లోతున్న లోయలో పడింది. దీంతో బస్సు…
దేశంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు, రూల్స్ తీసుకువచ్చినా.. రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అతి వేగం, మద్యం సేవించి.. వాహనాలు నడపడం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో బస్సు,ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయ్. ఈప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు.మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయ్. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని…