సింగరేణిలో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి… తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్‌ను మరో డంపర్ ఢీకొట్టిన ప్రమాదంలో.. ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు.. అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబంలో విషాదం నెలకొంది.