హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45లో జరిగిన ప్రమాదం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలో మహిళ పడేయడంతోనే చిన్నారి చనిపోయిందంటున్నారు ఎమ్మెల్యే షకీల్. జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ ఈ విధంగా స్పందించారు. ప్రమాదం జరిగిన తర్వాతే ఆ మహిళే పాపను కింద పడేసిందని, ఆమె పడేయడంతోనే చిన్నారి చనిపోయిందని షకీల్ తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాలని మీర్జా ఫ్యామిలీకి చెప్పానని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘గురువారం యాక్సిడెంట్…
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణిలోని బొగ్గు గనిలో పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు పనిచేస్తుండగా ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు రాగా ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తొలుత వారు మరణించారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం రాత్రి సమయంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం…
కాలాపతేర్ వద్ద సోమవారం పోలీసు వాహనం డ్రైవర్ మద్యం మత్తులో తన వాహనంతో ముగ్గురు పాదచారులను ఢీకొట్టారు. ఢీకొట్టడంతో ముగ్గురు పాదచారులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌జోన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుబంధంగా పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాస్ సాయంత్రం వాహనంలో కాలాపతేర్‌కు వెళ్లే సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు. అతనితో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నాడు. వాహనం తాడ్‌బన్ క్రాస్‌రోడ్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ అదుపు తప్పి ముగ్గురు పాదచారులను ఢీకొట్టినట్లు సమాచారం.…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు గుంటూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది.. హైదరాబాద్ నుండి త్రిపురాంతకం వెళ్తుండగా.. మాచర్ల మండలం ఎత్తిపోతల సమీపంలో ప్రమాదం జరిగింది.. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఓవర్ టేక్ చేస్తూ వెనుకనుంచి ఢీకొట్టింది మరోకారు.. అయితే, ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయ్యింది.. ఎమ్మెల్యే కారుమూరి సురక్షితంగా బయటపడ్డారు.. మరో వాహనంలో త్రిపురాంతకం వెళ్లిపోయారు…
ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక వర్షం కురిసే సమయంలో వాహనం నడపాలి అంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తెలియకుండానే ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదం ఒకటి మలేషియాలో జరిగింది. ఓ ద్విచక్రవాహనదారుడు రోడ్డుపై వెళ్తుండగా సడెన్‌గా బండి కిందపడిపోతుంది. కిందపడిన వెంటనే వెనుకనుంచి కారు దూసుకొచ్చిన విషయాన్ని గమనించి పక్కకు తప్పుకున్నాడు. ఆ వెంటనే వెనుక…
రాజేంద్ర నగర్ పీవీ ఎక్స్ ప్రెస్ పిల్లర్ నంబర్ 296 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న హైమద్ అనే వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎక్స్‌ప్రెస్ వేపై టూ వీలర్స్‌కు అనుమతి లేదు. ఆరంఘర్ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.కాగా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా…
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపురం నుంచి దువ్వాడకు చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ తాడేపల్లిగూడెం వద్ద బోల్తా కొట్టింది. లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు మరో 6గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై లారీ బోల్తా కొట్టడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్…
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 19 అంతస్తులున్న ఓ అపార్ట్మెంట్లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 60 మందికి గాయాలయ్యాయి. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతిచెందిన 19 మందిలో 9 మంది చిన్నారులు ఉన్నారు. మొదటి రెండు అంతస్తుల్లో అగ్నిప్రమాదం జరగడంతో మిగతా అంతస్తులలో నివశిస్తున్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. Read: నకిలీ సర్టిఫికెట్లపై…
ఎన్ని కఠిన ఆంక్షలు విధించిన, చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని శిక్షలు పడుతున్నాకానీ కొందరు మారడం లేదు. వారి జల్సాల కోసం మరొకరి ప్రాణాలు తీస్తూ నిందితులుగా మారుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దంటూ ప్రభుత్వాలు, పోలీసులు చెబుతున్నా పెడచెవిన పెడుతూ ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. అలాంటి ఘటనే ఘట్కేసర్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి నిఖిల్‌రెడ్డి మద్యం సేవించి అతి వేగంగా కారు నడుపుతూ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్…
ఓఆర్ఆర్ నుంచి కోదాడ వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. కారు వెనుకనుండి ఢీకొట్టింది లారీ. వాళ్లని హాస్పటల్ కు తరలించే సమయంలో మరో కారు ఆగింది. అంతేకాదు, ఆ కారు వచ్చి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. గాయపడ్డవారు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.…