ప్రధాని మోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కలిశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత రేఖ గుప్తా శనివారం మోడీని కలిశారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌ను కూడా ముఖ్యమంత్రి కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది.
Punjab: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ‘‘లేని’’ శాఖకు మంత్రిని నియమించింది. గత 20 నెలలుగా మంత్రి ఆ శాఖను నడిపాడని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్న కుల్దీప్ సింగ్ ధాలివాల్ రెండు విభాగాలకు మంత్రికి పనిచేస్తున్నారు. ఇందులో ఒకటి మనుగడలోనే లేదు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి లేఖ రాశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే పథకం గురించి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 23న ఆప్ శాసనసభా పక్షాన్ని కలవడానికి సమయం ఇవ్వాలని లేఖలో రేఖా గుప్తాను కోరారు.
Rekha Gupta: అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో శీష్ మహల్ పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ఆ భవనాన్ని మ్యూజియంగా మారుస్తామని ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తాం..
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాంలీలా మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు.
ఎల్లుండి రాంలీల మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మంగళవారం అధికారికంగా రేఖ గుప్తా పేరును బీజేపీ పెద్దలు ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Delhi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని అన్ని అధికారులతో సమావేశం నిర్వహించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 10 రోజులైంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.