మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిగువ కోర్టు నుంచి మంజూరైన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణ వరకు బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదల చేసిన ఉత్తర్వులను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ గురువారం ధృవీకరించింది. లోక్‌సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అది కుదరదని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు.
AAP: లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కూడా ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోలేదు.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ని కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది.
Delhi: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు, బీజేపీ అనుకున్న విధంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం 543 ఎంపీ సీట్లకు గానూ 2014, 2019లో బీజేపీ సొంతగానే మ్యాజిక్ ఫిగర్ మార్క్ 272ని దాటింది. అయితే, ఈ సారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం,
Arvind Kejriwal: లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌పై వచ్చిన ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు తీహార్ జైలులో లొంగిపోతున్నారు. అతని ఇంటి నుంచి బయలుదేరిని కేజ్రీవాల్, రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత హనుమాన్ మందిర్ని దర్శించారు
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయేందుకు తన నివాసం నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించనున్నారు.
ఈ రోజు విడుదలైన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే మరోసారి ఆధిక్యత కనబరుస్తోంది. ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో చూసిన లోక్‌సభ ఎన్నికలు-2024 ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
సార్వత్రిక ఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు విడతల పోలింగ్, కౌంటింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై చర్చించారు.