Punjab: ఖలిస్తాన్ వ్యతిరేకించే శివసేన లీడర్‌పై దాడి.. చెలరేగిన రాజకీయ దుమారం..
- శివసేన నాయకుడిపై దాడి..
- నిహాంగ్ సిక్కుల వేషధారణలో వచ్చి ఎటాక్..
- పంజాబ్ లూథియానాలో ఘటన..
- ఆప్‌పై ప్రతిపక్షాల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్‌కి చెందిన శివసేన నాయకుడిపై నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేయడం పొలిటికల్ వివాదంగా మారింది. సందీప్ థాపర్‌పై లూథియానలో కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన వీడియోలు సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి. ఈ దాడిలో థాపర్‌కి తీవ్రగాయాలయ్యాయి. ఖలిస్తాన్‌కి బద్ధవ్యతిరేకిగా తన వైఖరిని వినిపించడంతో థాపర్ పేరు తెచ్చుకున్నారు. సందేవన ట్రస్ట్‌లోని ఒక ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా, సాంప్రదాయ నిహాంగ్ దుస్తులు ధరించిన వ్యక్తులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు.
Read Also: Headaches : అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా.. వస్తే ఉపశమనం ఎలా పొందాలంటే..
Also Read
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
చేతులు జోడించి వేడుకున్నప్పటికీ కనికరం లేకుండా దాడికి పాల్పడ్డారు.ప్రస్తుతం థాపర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ఆయనను స్థానికులు అక్కడ నుంచి ఆస్పత్రికి తరలించారు. తల, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు గుర్తుతెలియన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సరబ్‌జిత్ సింగ్ మరియు హర్జోత్ సింగ్ అనే ఇద్దరు అనుమానితులను ఫతేఘర్ సాహిబ్ జిల్లాలో పట్టుకోగా, మూడో వ్యక్తి తెహల్ సింగ్ పరారీలో ఉన్నాడు. అరెస్టు సమయంలో దాడికి పాల్పడిన వారు ఉపయోగించిన స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పరిణామంపై పంజాబ్ లోని ఆప్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రం సహాయమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ మాట్లాడుతూ.. పంజాబ్‌లో శాంతిభద్రతలు విఫలమయ్యాయని, అధికారులు విధులను వదిలేసి, ఆప్ నేతల్ని సంతోషపెట్టడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు పర్తాప్ బజ్వా కూడా ఈ సంఘటనను ఖండించారు, అనేక త్యాగాల తర్వాత పంజాబ్‌లో శాంతి తిరిగి వచ్చిందని, రాష్ట్ర వాతావారణాన్ని పాడు చేయడానికి ఎవరిని అనుమతించకూడదని, పంజాబ్‌లో అన్ని మతాలకు చెందిన ప్రజలు ప్రేమ, సోదరభావంతో కలిసి జీవిస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!