Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ని చంపేందుకు కుట్ర జరగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.
ఇండియా కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఎక్స్ ట్విట్టర్‌లో ఆప్ ఎంపీకి సంబంధించిన ఫొటోను పోస్టు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ 8.5 కిలోలు తగ్గిపోయారని ఆ పార్టీ సంజయ్ సింగ్ ఆరోపించారు. తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆప్ మంత్రి అతిషి సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ (శుక్రవారం) తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు.
Punjab: పంజాబ్‌కి చెందిన శివసేన నాయకుడిపై నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేయడం పొలిటికల్ వివాదంగా మారింది. సందీప్ థాపర్‌పై లూథియానలో కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు.
ఢిల్లీ ఆమ్ ఆద్మీ మంత్రి అతిషిపై శనివారం పరువు నష్టం కేసు నమోదైంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది.
ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని తీస్ హజారీ కోర్టు మరోసారి పొడిగించింది.
Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆప్ మంత్రి అతిషీ నిరవధిక నిరాహార దీక్షను చేప్టటారు. అయితే, ఆందోళన స్థలంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.