ఆమ్ ఆద్మీ నేతలు పార్టీని వీడుతున్నారు.. ప్రజల్లో పార్టీపై ఎంత ఆగ్రహం ఉందో వారు గ్రహించారని ప్రధన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈసారి దేశ రాజధాని ఢిల్లీ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందని అతడు ధీమా వ్యక్తం చేశారు.
Delhi Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు వరసగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరగా, నిన్న ఆప్‌కి రాజీనామా చేసిన 08 మంది ఎమ్మెల్యేలు నేడు (శనివారం) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమకు టికెట్ ఇవ్వకపోవడంతో 08 మంది ఎమ్మెల్యేలు నిన్న ఆప్‌కి రాజీనామా చేశారు.
ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్నదే తన కల అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకా ప్రాంతంలో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ఐదు రోజుల ముందు ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల టిక్కెట్లను పార్టీ రద్దు చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజేష్ రిషి, నరేష్ యాదవ్, రోహిత్ కుమార్ మెహ్రాలియా శుక్రవారం రాజీనామా చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో ఆప్ సంబంధాలు గురించి అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్లపై రాజకీయ దుమారం రేపింది. యమునా నీళ్లల్లో బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం విష ప్రయోగం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు అంటేనే ఇలాంటి వింతలు.. విశేషాలు కామన్‌గా జరుగుతుంటాయి. అయితే ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారి ఢీకొంటున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన గురువు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అవినీతిపై స్పందిస్తూ.. ‘‘ఇది దురదృష్టకరం. ఆయన నాతో స్వచ్ఛంద సేవకుడిగా ఉన్నారు. జీవితంలో మీ ప్రవర్తన , అభిప్రాయాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నేను ఎప్పుడూ అతనికి చెప్పేవాడిని.