Mallikarjun Kharge: దేవెగౌడపై ఖర్గే పంచ్‌లు.. నవ్వులు చిందించిన మోడీ
- రాజ్యసభలో ఆహ్లాదకర వాతావరణం
- సభలో మల్లిఖార్జున ఖర్గే పంచ్‌లు
- నవ్వులు చిందించిన మోడీ.. సభ్యులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో పార్లమెంట్ ఉభయ సభల్లో సరదా సన్నివేశాలు కరవయ్యాయి. సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా నిరసనలు, నినాదాలతో సభలు దద్దరిల్లుతున్నాయి. అధికార-ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధంతో గందరగోళం నెలకొంటోంది. బుధవారం మాత్రం రాజ్యసభ ఆహ్లాదకరంగా.. ఉల్లాసభరితంగా మారిపోయింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున వేసిన పంచ్‌లతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. ప్రధాని మోడీ సహా సభ్యులంతా మనస్పూర్తిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వచ్చే నెలలో పలువురు రాజ్యసభ సభ్యులు నిష్క్రమించనున్నారు. దీంతో బుధవారం సభ్యులకు వీడ్కోలు చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దేవెగౌడపై పరోక్ష విమర్శలు గుప్పించారు. దేవెగౌడ తనకు 54 ఏళ్లుగా తెలుసని.. చాలా కాలం సన్నిహితంగా పని చేసినట్లుగా గుర్తుచేశారు. అయితే ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ మాతో ఉంటుండగానే అధికార పార్టీతో చేతులు కలిపారన్నారు. ఈ సందర్భంగా ‘‘ప్రేమ-పెళ్లి’’ పదాలు ఉపయోగించారు. మాతో డేటింగ్ చేసి.. చివరికి వారిని పెళ్లిని చేసుకున్నారని పంచ్ వేశారు. ఈ డైలాగ్‌తో ప్రధాని మోడీ సహా సహచర ఎంపీలంతా నవ్వుకున్నారు. అంతకముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
1996లో కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవెగౌడ ప్రధానమంత్రిగా కొంత కాలం పనిచేశారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జేడీఎస్, కాంగ్రెస్‌లు కలిసి పోటీచేశాయి. ఆ తర్వాత ఎన్డీఏతో పొత్తుపెట్టుకున్న జేడీఎస్.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతోంది. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.
#WATCH | Delhi | On Former Prime Minister and Rajya Sabha MP, HD Deve Gowda, Congress National President and LoP, Rajya Sabha, Mallikarjun Kharge says, "…I know Deve Gowda ji for more than 54 years and I worked with him a lot. Later, I don't know what happened…' Wo mohabbat… pic.twitter.com/FTyNLCQIzB
— ANI (@ANI) March 18, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!