ఢిల్లీలో ఎన్నికలు ముగిసి 24 గంటలకు పైగా గడిచింది. ఫలితాలు రావడానికి దాదాపు 36 గంటల సమయం మిగిలి ఉంది. ఇప్పటి వరకు విడుదలైన చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ మౌలానా సాజిద్ రషీది చేసిన ఈ వాదన ఎన్నికల గణాంకాల నిపుణులను కాస్త ఆశ్చర్య పరిచాయి. ఎగ్జిట్ పోల్స్‌కు మద్దతుగా ఆయన వ్యాఖ్యలు నిలిచాయి. పోలింగ్ అనంతరం మౌలానా సాజిద్ రషీది నిన్న ఓ వీడియోను…
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 60 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల మూడ్ బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు నిజం అయ్యాయి.. కొన్ని సార్లు అబద్ధం అయ్యాయని తెలిపారు.
Delhi Exit Poll: 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 5, 2025న జరుగుతోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంది.
AAP vs BJP: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. పోలింగ్ కేంద్రాలలో నగదు పంపిణీతో పాటు దొంగ ఓట్లు వేస్తున్నారని ఇర పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా.. తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమైంది. రేపు(ఫిబ్రవరి 05)న ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించారు. విమర్శలు.. ప్రతి విమర్శలతో మాటల యుద్ధం సాగించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర హల్చల్ చేసింది. పూర్వాంచల్‌కు చెందిన కొంతమంది మహిళలతో కలిసి యమునా నది నీళ్లు తీసుకుని కేజ్రీవాల్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది.